సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించండి : హైకోర్టు కీలక ఆదేశాలు
సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించండి : హైకోర్టు కీలక ఆదేశాలు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, జూన్ 25 :
స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణలో గతేడాది ఫిబ్రవరితోనే సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసింది. దీనిపై దాఖలైన ఆరు పిటిషన్‌లను జస్టిస్ మాధవి బెంచ్ విచారించింది. ఇవాళ తీర్పు వెల్లడించిందితెలంగాణలో గతేడాది ఫిబ్రవరితోనే సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసింది. దీనిపై దాఖలైన ఆరు పిటిషన్‌లను జస్టిస్ మాధవి బెంచ్ విచారించింది. ఇవాళ తీర్పు వెల్లడించింది. పిటిషనర్ల ఏమని వాదించారంటే... గతేడాది ఫిబ్రవరితో సర్పంచుల పదవీ కాలం ముగిసిందని తెలిపారు. ఇన్ని రోజులు ఎన్నికలు నిర్వహించకుండా తాత్సారం చేస్తున్నారని కోర్టుకు విన్నవించారు. సర్పంచ్‌ల స్థానంలో ప్రత్యేక అధికారులను నియమించి పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. దీని వల్ల ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని కోర్టు ముందు ఉదాహరణలతో ఉంచారు. మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా రావడం లేదని వివరించారు. కేంద్రం నుంచి నిధులు వస్తాయని చాలా మంది సర్పంచ్‌లు సొంత నిధులతో అభివృద్ధి పనులు చేశారని ఆ నిధులు రాక అప్పులు పాలయ్యారని వాపోయారు. వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టుకు రిక్వెస్ట్ చేశారు. పిటిషనర్ల వాదనకు ప్రభుత్వం తరఫున ఏజీ కౌంటర్ వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఈ ప్రక్రియ చేపట్టడానికి టైం పడుతుందని పేర్కొన్నారు. అదనంగా మరో నెలరోజులు గడువు కావాల్సి ఉందన్నారు. ఎన్నికల సంఘం తరఫున కూడా వాదనలు వినిపించిన న్యాయవాది రిజర్వేషన్ల ప్రక్రియతోనే నిర్వహణ ఆలస్యమవుతుందన్నారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల వచ్చిన వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తామని కోర్టుకు తెలిపారు. అటు ప్రభుత్వం, ఇటు ఎన్నికల సంఘం కూడా మరో గడువు కోరాయి. అన్నింటిని పరిగణలోకి తీసుకున్న కోర్టు సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తీర్పు చెప్పింది.
రాజ్యంగం ఏమి చెబుతోంది: తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికలు 30 సెప్టెంబర్ 2025లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే, ఈ తీర్పును ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది, రాజ్యాంగం స్థానిక సంస్థల ఎన్నికలపై ఏం చెబుతుందో సమగ్రంగా పరిశీలిద్దాం.స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ విధిరాజ్యాంగంలోని 73వ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పించారు. దీని ప్రకారం, గ్రామ పంచాయతీల పదవీకాలం ముగిసిన తర్వాత ఆరు నెలల్లోగా కొత్త పాలక వర్గం ఏర్పాటు చేసేందుకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇది రాజ్యాంగ విధి. తెలంగాణలో 12,991 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ పంచాయతీల పాలకవర్గం గడువు 2024 జనవరితో ముగిసింది. అప్పటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలనలో పంచాయతీలు ఉన్నాయి. ఆరు నెలల గడువులోగా ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ విరుద్ధం. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకునే హైకోర్టు ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు జారీ చేసింది.స్థానిక ప్రభుత్వాలలో ప్రజల ప్రాతినిధ్యం లేకపోవడం ప్రస్తుతం పంచాయతీలు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో నడుస్తున్నాయి. కానీ రాజ్యాంగం ప్రకారం పంచాయతీల పాలన ప్రజలు ఎన్నుకున్న పాలకవర్గం ద్వారా నడవాల్సి ఉంది. ప్రత్యేక అధికారుల పాలన తాత్కాలిక ఏర్పాటు తప్ప ప్రజాస్వామ్యబద్ధమైన వ్యవస్థ కాదని కోర్టు అభిప్రాయం. స్థానికంగా ప్రజల భాగస్వామ్యంతోనే పాలన జరగాలన్నది రాజ్యాంగ స్ఫూర్తి. వారి భాగస్వామ్యం లేకపోవడం అంటే ప్రజల గొంతుకను అణిచివేయడమని హైకోర్టు అభిప్రాయపడింది. ఎన్నికల జాప్యానికి సంబంధించి ఎన్నికల సంఘం కోర్టు ముందు ఉంచిన కారణాలను సాకులుగా భావించి న్యాయస్థానం తిరస్కరించింది.ఎన్నికల నిర్వహణలో జాప్యానికి ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పిన కారణాలివే:
1. గ్రామ పంచాయతీల పునర్విభజన, కొన్ని గ్రామ పంచాయతీలు సరిహద్దుల పునర్విభజన పెండింగ్‌లో ఉన్నాయి.
2. ఓటర్ల జాబితాలో సవరణలు పూర్తిగా జరగలేదని, మార్పులు-చేర్పులు, తొలగింపు వంటి ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు.
3. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన ప్రక్రియ ఖరారు కాలేదు.
4. వర్షాకాలంలో ఎన్నికల నిర్వహణ కష్టమైన పని.
ఈ కారణాలను హైకోర్టు తప్పుబట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సాకులు చెబుతున్నారని ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని న్యాయస్థానం ఆక్షేపించింది. ఈ ప్రక్రియను ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుగానే పూర్తి చేసి ఉండాలని అభిప్రాయపడింది. వర్షాకాలంలో అవసరమైన చర్యలు చేపట్టి ఎన్నికలను పూర్తి చేయాలని ఆదేశించింది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.
స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రజాప్రయోజన వ్యాజ్యాలు
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యం చేస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వంపై కొందరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేశారు. అందులో రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన తన విధులు
నిర్వర్తించడంలో విఫలమైందని, ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకుంటుందని పేర్కొనడం జరిగింది. ఈ పిటిషన్లను కొందరు మాజీ సర్పంచ్‌లు, సామాజిక కార్యకర్తలు, రాజకీయనేతలు వేయడం జరిగింది. దీనిపై స్పందించిన హైకోర్టు విచారణను చేపట్టింది. ఎన్నికల సంఘం చూపించిన కారణాలను తప్పుబట్టిన హైకోర్టు సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలోనే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను జారీ చేయాల్సి ఉంటుంది.