స్వేచ్ఛ కూతురు.. పూర్ణచందర్‌పై సంచలన ఆరోపణలు

స్వేచ్ఛ కూతురు.. పూర్ణచందర్‌పై సంచలన ఆరోపణలు

స్వేచ్ఛ కూతురు.. పూర్ణచందర్‌పై సంచలన ఆరోపణలు

తనతో కూడా అతను అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణ

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 30 : తెలుగు యాంకర్‌ స్వేచ్ఛ వొటార్కర్‌   ఆత్మహత్య కేసు యావత్ రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ కేసులో నిందితుడు పూర్ణచందర్‌ను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. స్వేచ్ఛ కూతురు.. పూర్ణచందర్‌పై సంచలన ఆరోపణలు చేసింది. తన తన తల్లి సూసైడ్‌కు కారణమైన పూర్ణచందర్‌ను చంపేయాలని ఆయన చిన్నారి డిమాండ్ చేసింది. అంతేకాక తనతో కూడా అతను అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణ చేసింది.అయితే తాజాగా పూర్ణచందర్ భార్య స్వప్న మీడియా ముందుకు వచ్చారు. తన భర్తపై స్వేచ్ఛ  కూతురు తన భర్తపై వేసిన నిందులు విని తట్టుకోలేకోపోయానని ఆమె అన్నారు. స్వేచ్ఛ కూతురిని పూర్ణచందర్ సొంత కూతురిలా చూసుకున్నారని ఆమె తెలిపారు. స్వేచ్ఛ పూర్ణను బ్లాక్‌మెయిల్ చేసిందని.. తనను కూడా చాలా టార్చర్ పెట్టిందని పేర్కొన్నారు. స్వేచ్ఛ కూతురితో అలా ఎవరు చెప్పిస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త చెడ్డవాడు కాదని.. న్యాయస్థానంపై తనకు నమ్మకం ఉందని ఆమె అన్నారు.