అయోధ్య రామమందిరం నమూనాలో బాలాపూర్ గణేష్ మండప నిర్మాణం
అయోధ్య రామమందిరం నమూనాలో బాలాపూర్ గణేష్ మండప నిర్మాణం
ప్రజాక్షేత్ర్, రంగారెడ్డి బ్యూరో :
బాలాపూర్ గణేష్ మండపాన్నిఉత్సవ సమితి అధ్యక్షులు కళ్లెం నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో అయోధ్య బాల రామమందిరం నమూనాలో నిర్మిస్తున్నారు. దిల్ సుఖ్ నగర్ డెకరేటర్ సుధారక్ ఆధ్వర్యంలో కలకత్తాకు చెందిన 40 మంది కళాకారుల బృందం ఇప్పటికే గణేష్ మండప పనులను ప్రారంభించారు. సెప్టెంబర్ 7వ తేదీ లోపు అయోధ్య ఆలయం ఆకృతిలో బాలాపూర్ గణేష్ మండప నిర్మాణ పనులు పూర్తి చేయనున్నారు. మండపంలో అయోధ్య బాలరాముని ఆకృతిలో విగ్రహంతో పాటు ఇతర దేవతా మూర్తుల విగ్రహాలను విగ్రహాలను భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే దూల్పేట్ నుంచి 23 ఫీట్ల ఎత్తైన విగ్రహాన్ని కొనుగోలు చేసి తీసుకువచ్చారు. 21 కిలోల లడ్డూను కూడా ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు.