వాసవి అమ్మవారికి ఆషాడమాస సారె సమర్పణ

వాసవి అమ్మవారికి ఆషాడమాస సారె సమర్పణ

వాసవి అమ్మవారికి ఆషాడమాస సారె సమర్పణ
ప్రజా క్షేత్ర్, నరసరావుపేట :
నరసరావుపేట పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం అమ్మవారికి ఆషాడమాస సారే సమర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో 125 మంది మహిళలచే అత్యంత వైభవంగా అమ్మవారి నగరోత్సవం, దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి 58 రకముల పూలు, గాజులు, చీరలు, జాకెట్ ముక్కలు, గోరింటాకు ప్యాకెట్స్, అనేక పిండి వంటలు అమ్మవారికి సారె గా సమర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ కొత్త మాసు మెహర్ బాబు, కార్యదర్శి కొత్త మాసు వెంకటప్పయ్య, కోశాధికారి పొత్తూరి లక్ష్మీ వరప్రసాదరావు, మారుతీ కృష్ణ, రెడ్డి శ్రీనివాసరావు, కొత్త హనుమంతరావు, మురారి శెట్టి పద్మ, యక్కల సుజాత, కొత్తూరి లక్ష్మీ కుమారి, దేవస్థాన పాలకమండలి సభ్యులు, చలువాది బ్రహ్మయ్య, చేగు వెంకటేశ్వరరావు అనేకమంది మహిళా భక్తులు పాల్గొని పూజలు నిర్వహించినారు.