ఆపరేషన్ సిందూర్” సైనిక చర్య చరిత్రలో గర్వకారణమైన అధ్యాయం

ఆపరేషన్ సిందూర్” సైనిక చర్య చరిత్రలో  గర్వకారణమైన అధ్యాయం

ఆపరేషన్ సిందూర్” సైనిక చర్య చరిత్రలో  గర్వకారణమైన అధ్యాయం
*దేశీయ టెక్నాలజీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి.
*భారత యువతకు డా. ర్యాగ రిషి అరుణ్ పిలుపు
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ : 
దేశ భద్రత మరియు గౌరవం విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రపంచానికి గంభీర సందేశాలు పంపించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  నాయకత్వంలో నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్” సైనిక చరిత్రలో ఒక గర్వకారణమైన అధ్యాయంగా నిలిచిందని, పాకిస్తాన్ మద్దతుతో భారత భూభాగంపై చొరబాటు చేస్తున్న ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం అత్యంత వ్యూహాత్మకంగా దాడి చేసి వాటిని ధ్వంసం చేసిందని డా. ర్యాగ రిషి అరుణ్  కోఆర్డినేటర్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం  విలేకరుల సమావేశంలోపేర్కొన్నారు . ప్రపుల్ పొడిశెట్టి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ బీసీ లిబరేషన్ ఫోర్స్ మరియు బీసీ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ భారత్ సేన చేసిన ఆపరేషన్ సిందూర్ లో, పౌరులకు ఎలాంటి హాని కలగకుండా అత్యాధునిక టెక్నాలజీతో ఉగ్రవాద శిబిరాలను ఒక్కొక్కటిగా నాశనం చేసింది. పాకిస్తాన్, చైనా, టర్కీ దేశాల నుండి దిగుమతి చేసుకున్న డిఫెన్స్ టెక్నాలజీ, డ్రోన్లను కూడా భారత్ సమర్థవంతంగా నిర్వీర్యం చేసింది. ఇది భారత్ సాంకేతికంగా ప్రపంచంలోని ఏ దేశానికీ తీసిపోనిదని మరోసారి నిరూపించింది అని అన్నారు.భారత యువత కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఇన్నోవేషన్ మిషన్ వంటి పథకాల ఉపయోగం తీసుకొని దేశీయ టెక్నాలజీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ప్రతి యువత రక్షణ, వ్యవసాయం, ఆరోగ్యం వంటి రంగాల్లో స్వదేశీ పరిష్కారాలపై దృష్టి సారించాలి. భారత్‌కి కావలసింది ఆయుధాలు మాత్రమే కాదు — ఆవిష్కరణలు, ఆత్మవిశ్వాసం, ఆదర్శాల కలయిక!దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహిద్దా మన్నారుప్రస్తుతం చాలామంది విదేశీ పర్యటనల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ మన దేశంలోనే చూడదగిన ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈశాన్య భారత రాష్ట్రాలు — త్రిపురా, మణిపూర్, అసోం, అరుణాచల్ ప్రదేశ్ — సాంస్కృతికంగా, భౌగోళికంగా, ఆధ్యాత్మికంగా విలక్షణమైనవి.కామాఖ్యా దేవాలయం (అసోం), త్రిపురేశ్వరి దేవాలయం (త్రిపురా), శ్రీగోవిందాజీ ఆలయం (మణిపూర్), తవాంగ్ మఠం (అరుణాచల్ ప్రదేశ్) వంటి ప్రదేశాలు భారత ప్రాచీనతను ప్రతిబింబిస్తాయి. అలాగే కాశీ, అయోధ్య, కేదారనాథ్, ద్వారకా, తిరుపతి, రామేశ్వరం, మాత విష్ణో దేవి వంటి పవిత్ర ప్రదేశాలు భారతీయ సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనాలన్నారు.దేశాభిమానం అనేది నినాదంగా కాదు – జీవన విధానంగా ఉండాలి అని డా. ర్యాగ రిషి అరుణ్ అన్నారు. భారతమాత సేవలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత నిర్వర్తించాలి అని పిలుపు ఇచ్చారు.