ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర..! ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన ఇద్దరు వ్యక్తులు
ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర..! ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన ఇద్దరు వ్యక్తులు
ప్రజాక్షేత్ర్, క్రైం బ్యూరో
బీజేపీ ఫైర్ బ్రాండ్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద ఒక వర్గం కు చెందిన ఇద్దరు వ్యక్తులు రెక్కీ నిర్వహించడం తీవ్ర కలకలం రేపుతుంది. ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి ముందు ఇద్దరు వ్యక్తులు అనుమాస్పదంగా సంచరిస్తుండడంతో గమనించిన స్థానికులు వారిని పట్టుకున్నారు. వారిని తనిఖీ చేయగా తుపాకులు, బుల్లెట్ లు, ఎమ్మెల్యే రాాజా సింగ్ ఫొటోలతో పాటు అతని ఇంటి ఫొటోలు కనిపించాయి. దీంతో స్థానికుు వారిని మంగళాట్ పోలీసులకు అప్పగించారు. వీరిని ఇస్మాయిల్, మహ్మద్ ఖాజాగా పోలీసులు గుర్తించారు. దీంతో రాజాసింగ్ హత్యకు ఏమైనా కుట్ర పన్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంకా పూర్తి వివరాలుతెలియాల్సి ఉంది.