కరీంనగర్ రూ.31 కోట్లతో ఉపాధి నిధులతో రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం : కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్ రూ.31 కోట్లతో ఉపాధి నిధులతో రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం : కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రూ.31 కోట్లతో ఉపాధి నిధులతో రోడ్ల నిర్మాణం:
కేంద్ర మంత్రి బండి సంజయ్ 

సీఆర్ఐఎఫ్ నిధులతో 1314 కి.మీల పరిధిలో రోడ్లను విస్తరించాం

పీఎంజీఎస్ వై కింద మారుమూల గ్రామాల్లో రోడ్లను నిర్మించాం.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడి
కొత్తపల్లిలో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన రోడ్డును ప్రారంభించిన కేంద్ర మంత్రి.
ఆసిఫ్ నగర్ లో ఎంపీ లాడ్స్ నిధులతో కూరగాయల మార్కెట్ షెడ్ కు శంకుస్థాపన

ప్రజా క్షేత్ర్, కరీంనగర్ :
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. అందులో భాగంగా జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.31 కోట్ల 12 లక్షల రూపాయలతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంతర్గత రోడ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. కరీంనగర్ నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని ఖాజీపూర్ లో  జాతీయ ఉపాధి హామీ పథకం కింద 14 లక్షల రూపాయలతో చేపట్టిన రోడ్డును బండి సంజయ్ ప్రారంభించారు. అనంతరం కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్ నగర్ లో 9 లక్షల 50 రూపాయల ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మించనున్న మార్కెట్ షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద మొత్తం  పెద్ద ఎత్తున పనులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా రోడ్లను నిర్మిస్తున్నాం. ఈసారి ఈ పథకం కింద దాదాపు 31 కోట్ల 12 లక్షల రూపాయల పనులు జరుగుతున్నాయి. ఈ కొత్తపల్లి మండలంలో రోడ్ల నిర్మాణం కోసం ఈ ఏడాది 74 లక్షల రూపాయలను విడుదల చేశారు.  అందులో భాగంగా ఖాజీపూర్ లో  జాతీయ ఉపాధి హామీ పథకం కింద 14 లక్షల రూపాయలతో చేపట్టిన రోడ్డును  ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల నిధి సిఆర్ ఐ ఎఫ్, కింద రూ. 291 కోట్లను ఖర్చు చేసి 1341 కిలోమీటర్ల మేరకు రోడ్లను నిర్మించామన్నారు. తెలంగాణలోనే అత్యధికంగా   సిఆర్ ఐఎఫ్, నిధులను తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రోడ్లను నిర్మించగలగడం సంతోషంగా ఉందన్నారు. ఇవిగాకుండా ప్రధానమంత్రి సడక్ యోజన కింద వందల కోట్లను ఖర్చు చేసి మారుమూల గ్రామాల్లో రోడ్లను నిర్మించినట్లు తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ విషయానికొస్తే.. జాతీయ రహదారుల నిర్మాణం కోసం దాదాపు 5 వేల కోట్లు ఖర్చు చేసినం కరీంనగర్ నుండి వరంగల్, సిద్దిపేట నుండి ఎల్కతుర్తి నేషనల్ హైవేల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలోనే కరీంనగర్- జగిత్యాల రోడ్డ నిర్మాణ పనులను ప్రారంభించబోతున్నం అని పేర్కొన్నారు. ప్రయాణీకులకు కలుగుతున్న ఇబ్బందులను ద్రుష్టిలో ఉంచుకుని నేషనల్ హైవే నిధులతో రాజీవ్ రహదారిని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. అయితే ప్రస్తుతం స్టేట్ హైవేగా ఉన్న ఈరోడ్డు మెయింటెనెన్స్ కు సంబంధించి కాంట్రాక్ట్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. సదరు కాంట్రాక్టర్ తో మాట్లాడుకుని సమస్యను సెటిల్ చేసుకుని  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపితే వెంటనే రాజీవ్ రహదారిని విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.