కేసీఆర్ ను తిట్టుడే రేవంత్ పని : హరీష్ రావు

కేసీఆర్ ను తిట్టుడే రేవంత్ పని : హరీష్ రావు

కేసీఆర్ ను తిట్టుడే రేవంత్ పని : హరీష్ రావు
ప్రజా క్షేత్ర్, మెదక్ :
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి రెండు రకాల కమిషన్లకు అలవాటు పడ్డారు. ఒకటి ప్రతిపక్షంపై విచారణకు కమిషన్, రెండోది బిల్లులు ఇవ్వాలంటే మరో కమీషన్. కమిషన్లు, కేసులు, ఢిల్లీకి మూటలు మోయడమే సీఎం రేవంత్ పని. మేడిగడ్డను ఎండబెట్టి బనకచర్లకి గోదావరి జలాల తరలింపు కోసం సీఎం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎపి సీఎం చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించడానికి కంకణం కట్టుకున్నాడు. సీఎం రేవంత్ బిల్లులు చెల్లించడానికి చేతకాక హాస్టళ్లల్లో ఏసీబీ తనిఖీలు చేయిస్తున్నారు. కమీషన్ కోసం రెండేళ్లుగా కోడిగుడ్డు టెండర్ ని పక్కన పెట్టారు.  ఈ 20 నెలల్లో మాజీ సీఎం కేసీఆర్ ని తిట్టుడే పనిగా సీఎం రేవంత్ పనిపెట్టుకున్నారు. ఇలా తిడితే ప్రజలు ఊరుకోరు...ఈ విషయం మీ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డినే చెప్పారు. ఈ విషయం మీ పార్టీ ఎమ్మెల్యేకి అర్థం అయ్యింది... సీఎంకి మాత్రం అర్థం కావడం లేదని అన్నారు.