కొత్త చట్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ సదస్సులు : తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క

కొత్త చట్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ సదస్సులు   : తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క

కొత్త చట్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ సదస్సులు
             తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 3 :
 కొత్త చట్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ సదస్సులు నిర్వహిస్తున్నామని, తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా- ఎర్రుపాలెం సదస్సులో ఆయన మాట్లాడుతూ..  రైతులకు ఎంతో ఉపయోగపడే భూభారతి చట్టాన్ని జాగ్రత్తగా రూపకల్పన చేశామని తెలిపారు. అత్యంత పారదర్శకమైన ఈ చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని అన్నారు. గతంలో భూమికి రకం కట్టడం వల్ల రైతులకు భూమి ఎంత ఉందో తెలిసేది అని చెప్పారు. ఏటా రకం కట్టడం వల్ల రికార్డుల్లో   భూమి మారితే వెంటనే రైతులకు తెలిసేదని, గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతులకు వివరాలు తెలియకుండా పోయిందని భట్టి విమర్శించారు.