ఘనంగా నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 21వ వేడుకలు

ఘనంగా నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 21వ వేడుకలు

ఘనంగా నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 21వ వేడుకలు 

ముఖ్య అతిధిగా హాజరయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 

ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో

నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం (నేషనల్ అకాడమీ ఫర్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ NALSAR) 21వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పీఎస్.నర్సింహ  తదితరులు అధిధులుగా పాల్గొన్నారు. యూనివర్సిటీ చాన్సలర్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్‌ అరాధే  కోర్సులను విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. నల్సార్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీకృష్ణ దేవ రావు , వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్.వాసంతి, మంత్రి సీతక్క, తదితరులు పాల్గొన్నారు. పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంబీఏ, బీఏ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ తదితర కోర్పులను విజయవంతంగా పూర్తి చేసుకున్న 592 మంది విద్యార్థులకు పట్టాలు అందుకున్నారు. పట్టభద్రులైన వారిలో 57 మంది గోల్డ్ మెడల్స్ సాధించారు.