ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు... రాహుల్ గాంధీ మంచి విజన్ ఉన్న నాయకుడు
ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
రాహుల్ గాంధీ మంచి విజన్ ఉన్న నాయకుడు
నిన్నటి త్యాగాలకు వారసుడు రేపటి తరానికి మార్గదర్శకులు
దేశ ప్రజల తరఫున ప్రశ్నించే ఏకైక గొంతుక
ప్రజా క్షేత్ర్, చార్మినార్ :
పాతబస్తీ చాంద్రాయణగుట్టలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి బోయ నగేష్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ 55వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అయన తో పాటు చార్మినార్ టీపీసీసీ కో ఆర్డినేటర్ సుబ్రహ్మణ్యం, టీ పీ సీ సీ ప్రధాన కార్యదర్శి అల్లం భాస్కర్ లు పాల్గొని, చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులకు బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ మంచి విజన్ ఉన్న నాయకుడు,యువతకు ఆదర్శం,నిరంతరం దేశప్రజాసామ్యాలపై పోరాడుతూనే ఉంటాడన్నారు. కాంగ్రెస్ పార్టీ కి ఆశకిరణం,ధృవ తార అని,రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి నీ చేసెంతవరకు అహర్నిశలు పనిచేస్తామన్నారు. ఈ దేశంలో అన్ని సామాజిక వర్గాలకు సామాజిక న్యాయం జరగాలని పోరాడుతున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు. దేశంలో పేదరికం రోజుకు రోజుకు పెరిగిపోతుందని ఆ పేదరిక నిర్మూలన జరగాలంటే దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నేతలు వెంకటేష్ ముదిరాజ్, పర్వతాల రాజేందర్, ఎల్. నర్సింగ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.