జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో రాయితీ కల్పించాలని కలెక్టర్ కు TUWJ వినతి

*జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య అందించండి*
*రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి జర్నలిస్టుల వినతి పత్రం*
*విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేసిన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నాయకులు*
ప్రజా క్షేత్ర్, రంగా రెడ్డి :
జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో రాయితీ కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని టియుడబ్ల్యూజే (ఐజేయు) రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సలీం, ఉపాధ్యక్షుడు కొనియాల భాస్కర్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు చెక్కల శ్రీశైలం, కార్యదర్శి రాఘవేందర్ యాదవ్ (రఘు) తో పాటు కార్యవర్గ సభ్యులు కోరారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కి టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల పిల్లలు కార్పొరేట్ పాఠశాలల్లో విద్యను అభ్యసించేందుకుగాను ఫీజులు రాయితీ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో మాదిరిగా ఉన్న ఫీజులో 50% రాయితీ కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో విద్యాశాఖ ప్రత్యేక సర్కులర్ ను జారీ చేశారని గుర్తు చేశారు. మరో మూడు రోజుల్లో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే అవకాశం ఉంది కాబట్టి సంబంధిత విద్యాశాఖ అధికారులు సకాలంలో స్పందించి రాయితీకి సంబంధించిన సర్కులర్ ను జారీ చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బ్యూరో చీఫ్ లు ప్రదీప్,పాండు, కలెక్టరేట్ రిపోర్టర్లు బాలు, భాస్కర్, పాండురంగ రెడ్డి, పాండు యాదవ్, రాజేంద్ర నగర్ నియోజకవర్గ అధ్యక్షులు దామోదర్ రెడ్డి, వర్కల చందు, ప్రేమ్, డి శ్రీనివాస్, రాజ్ కుమార్, శ్రావణ్, మహేందర్, కలెక్టరేట్ రిపోర్టర్లు శ్రీనివాస్, ఇలియాజ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.