తెలంగాణ ప్రతిష్ట పెంచిన అందాల పోటీలు

తెలంగాణ ప్రతిష్ట పెంచిన అందాల పోటీలు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, జూన్ 3 :
దాదాపు నెల రోజుల పాటు జరిగిన మిస్ వరల్డ్ పోటీలు ముగిసాయి. రకరకాలఈవెంట్స్ లో భాగంగా ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు తెలంగాణ ప్రతిష్టను పెంచాయి. బిగ్ ఫోర్ బ్యూటీ కాంటెస్ట్ లలో ( మిస్ యూనివర్స్, మిస్ ఇంటర్నేషనల్, మిస్ ఎర్త్ , మిస్ వరల్డ్ )ఒకటైన మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఘనంగా ముగిశాయి. నెల రోజులపాటు ప్రపంచ సుందరీమణులంతా తెలంగాణలో సందడి చేశారు. ఈ పోటీలు కేవలం అందగత్తెల ఎంపిక మాత్రమే కాకుండా, తెలంగాణ సంస్కృతి, ప్రత్యేక ఆతిథ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిందీ అందాల పండుగ. వివిధ సంస్కృతుల నుంచి వచ్చిన సుందరీమణుల సామాజిక సేవా కోణం ప్రదర్శితమైంది. మిస్ వరల్డ్ పోటీలకు భారత్ మూడోసారి ఆతిథ్యం ఇచ్చింది. 1996లో ఇండియన్ సిలీకాన్ వ్యాలీగా పేరుపొందిన బెంగళూరు ఆతిథ్యం ఇవ్వగా, 2024లో మన దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబయి వేదికైంది. గతేడాదే మన దేశ ఆతిథ్యం రుచి చూసిన మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ మరోసారి ఇండియాలోనే ఈ పోటీలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈదఫా అందుకు సిటీ ఆఫ్ పెరల్స్ గా ప్రపంచంలో గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరాన్ని వేదికగా ఎంచుకుంది. మే 10, 2025న ప్రారంభమైన ఈ పోటీలు నెల రోజుల పాటు సాగాయి. ఈ అతి పెద్ద అందాల సుందరాంగుల పండుగలో 108 దేశాల అందగత్తెలు మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీ పడ్డారు.మిస్ వరల్డ్ 2025 వేడుకల్లో తెలంగాణ సంస్కృతిని పరిచయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెల రోజులపాటు సాగిన అందాల పండుగలో ప్రపంచ సుందరీమణులు తెలంగాణ పర్యాటక స్థలాలు, చారిత్రాత్మక ప్రాంతాలను సందర్శించి అక్కడి విశేషాలను తెలుసుకున్నారు. చార్మినార్, రామప్ప దేవాలయం, నాగార్జున సాగర్ లోని బుద్ద వనం, యాదాద్రి దేవాలయం వంటి ప్రాంతాలను సందర్శించారు. చారిత్రాత్మక కట్టడాలను చూసి వారు అబ్బురపడ్డారు. అంతే కాకుండా నవ తెలంగాణకు నిదర్శనమైన తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, నూతన సచివాలయం, రామోజీ ఫిల్మ్ సిటీ వంటి పర్యాటక ప్రాంతాలను, నిర్మాణాలను చూసి ఆశ్చర్యమయ్యారు. అంతే కాకుండా తెలంగాణ స్థానిక కళలను వీక్షించారు. సంప్రదాయ వంటకాలను రుచి చూశారు. స్థానిక నృత్యాలను అనుసరిస్తూ వారు చిందులేశారు. దాకేవలం ర్యాంపులపై హోయలొలికిస్తూ నడవటమే కాదు సామాజిక బాధ్యతలో తాము అంటూ నిర్వహించే బ్యూటీ విత్ ఏ పర్పస్ కాంటెస్ట్ ఈ అందాల పోటీల్లో హైలెట్ గా చెప్పవచ్చు. ఇందులో పోటీ పడ్డ అందగత్తెలందరూ సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టులను ఇక్కడ ప్రదర్శించారు. మన దేశం నుంచి పోటీ పడ్డ నందినీ గుప్తా ప్రాజెక్ట్ ఏక్తాను ప్రదర్శించారు. దివ్యాంగుల పట్ల అవగాహన, వారి పట్ల దయ,కరుణను పెంచే ప్రాజెక్టు ఇది. అయితే ఈ పోటీలో పైప్ లైన్ ఫర్ లైఫ్ లైన్ ప్రాజెక్టును ప్రదర్శించిన ఇండోనేషియా కాంటెస్ట్ మోనికా కెజియా సెంబరింగ్ , బ్యూటి విత్ ఏ పర్పస్ పోటీలో గెలుపొందారు. పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్య సదుపాయలను మెరుగుపర్చే ప్రాజెక్టు ఇది.మిస్ వరల్డ్ 2025లో మరో ప్రధాన ఆకర్షణ గచ్చిబౌలి ఇండోర్ స్డేడియంలో జరిగిన అందాల భామల స్పోర్ట్స్ ఛాలెంజ్ పోటీలు. ఈ ఛాలెంజ్ లో ప్రధానంగా మల్లఖంబ, యోగా, మార్షల్ ఆర్ట్స్, వంటి భారతీయ సంప్రదాయ పోటీలను నిర్వాహకులు నిర్వహించారు. వీటితోపాటు స్కేటింగ్, జమ్నాస్టిక్, షాట్ పుట్, బ్యాట్మింటన్, ఫుట్ బాల్ షూటౌట్స్, స్ప్రింట్, జుంబా సెషన్ వంటివి నిర్వహించారు. ఈ పోటీల్లో చిన్న పిల్లల్లా వీరంతా పాల్గొని కేరింతలు కొట్టారు. ఇందులో మిస్ ఎస్టోనియా ఎలిస్ రాండ్మా గోల్డ్ మెడల్ గెల్చుకున్నారుశిల్పకళావేదికగా ప్రపంచ సుందరీమణులంతా వారి కున్న టాలెంట్స్ ను ప్రదర్శించే పోటీలో ఉత్సాహంగా పాల్గొనడం ఈ ఈవెంట్లో మరో ముఖ్య ఆకర్షణ. వీరంతా సంగీత వాయిద్యాలు వాయించడం, పాటలు పాడటం, వారి స్థానిక నృత్య రీతులను ప్రదర్శించడం వంటివి చేసి ఆకట్టుకున్నారు. అంతే కాకుండా కవిత్వం, ఉపన్యాస పోటీలు, ఏక పాత్రాభినయనం వంటి నైపుణ్యాలతో ఆకట్టుకున్నారు. చిన్న నాటికలు వేసి తమ నటనా సామర్ధ్యాన్ని బయటపెట్టారు. ఇందులో మిస్ నైజిరీయ్ ఆడా ఓలువ్మి తన పాటలు, డాన్స్ లతో ఉర్రూతలూగించారు. ఇక తెలుగులో బాగా వైరల్ అయిన రాను ముంబయికి నే రాను అనే పాట పాడి, ఆఫ్రికన్- ఇండియన్ స్టైల్ లోఆ పాటకు డ్యాన్స్ చేసి వేసిన స్టెప్పులు సూపర్ డూపర్ గా ఆకట్టుకున్నాయివరల్డ్ -2025 ఫైనల్స్ పోటీల్లో మిస్ వరల్డ్ 2016 విజేత స్టెఫానీ డెల్వాలే, ఇండియన్ టీవీ ప్రజెంటర్ సచిన్ కుంభార్ తమ వాఖ్యానంతో అదరగొట్టారు. బాలీవుడ్ స్టార్స్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ చేసిన డ్యాన్సులు ఆహుతులను ఆలరించాయి. ఇషాన్ ఖట్టర్ ఆర్. ఆర్. ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు వేసిన స్టెప్పులు అక్కడికి ప్రపంచ సుందరీమణులు లేచి ఆడేలా చేశాయి.మిస్ వరల్డ్ జడ్జి ప్యానెల్ లో మన భారతీయులే ఎక్కువ మంది ఉండటం విశేషంగా చెప్పాలి. ఇందులో సినీ యాక్టర్ సోనూ సూద్, రానా, నమ్రత శిరోద్కర్, మాజీ మిస్ ఇంగ్లాండ్ డా. కరీనా టర్రెల్, మిస్ వరల్డ్ ఛైర్ పర్సన్ జూలియా మెర్లీ, మిస్ వరల్డ్ 2017 మానుషి చిల్లర్, ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్, వ్యాపారవేత్త సుధారెడ్డి ఉన్నారు. ఈ వేడుకల్లోనే సోనూ సూద్ ప్రముఖ మానవతా వాదిగా ప్రత్యేక గౌరవాన్ని రానా చేతుల మీదుగా పొందారు.ఈ ఏడాది మిస్ వరల్డ్ క్రౌన్ అత్యంత విలువైంది. 1770 వజ్రాలతో 175.49 క్యారెట్ల మొత్తంలో, 18 క్యారెట్ వైట్ గోల్డ్ తో ఈ కిరీటం తయారు చేశారు. దీని విలువ మూడు కోట్లు. ప్రైజ్ మనీ 8.5 కోట్లు గా ప్రకటించారు. ఈ సంవత్సరం మిస్ వరల్డ్ క్రౌన్ అత్యంత విలువైనదిగా నిలిచింది.మిస్ వరల్డ్ 72 ఎడిషన్లలో గతంలో ఎన్నడూ లేనిది, తొలిసారి థాయ్‌లాండ్ ఈ కిరీటాన్ని దక్కించుకుంది. ఈ గ్రాండ్ ఫినాలేలో థాయ్‌లాండ్ అందగత్తె సుచాత చాయాంగ్రి శ్రీ విజేతగా నిలిచారు. ఫస్ట్ రన్నరప్ గా ఇథియోపియాకు చెందిన హాసెట్ డెరెజె ఫస్ట్ రన్నరప్ గా నిలిచారు. ఇలా ఇధియోపియా నుంచి పోటీ పడిన ఓ సుందరీమణికి ఫస్ట్ రన్నరప్ రావడం 72 ఎడిషన్లలో ఇదే తొలిసారి. ఈ మిస్ వరల్డ్ పోటీల్లో ఇదీ ఓ హైలెట్ .