తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు
తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు
ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ విద్యా కమిషన్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీ ప్రైమరీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు విద్యా రంగంపై సమగ్రమైన విద్యా పాలసీని తయారు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ కమిషన్ ను ఏర్పాటు చేసింది. చైర్మన్ తో పాటు విద్యా రంగంలో నిపుణులైన ముగ్గురు సభ్యులతో కమిషన్ ను ఏర్పాటు చేశారు. విద్యా శాఖ ఉన్నతాధికారి మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు.