ఆదాయ పెంపు మార్గాలపై దృష్టిని సారించండి : రేవంత్ రెడ్డి

ఆదాయ పెంపు మార్గాలపై దృష్టిని సారించండి : రేవంత్ రెడ్డి

ఆదాయ పెంపు మార్గాలపై దృష్టిని సారించండి : రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

రాష్ట్ర వార్షిక లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయ పెంపు మార్గాలపై దృష్టిని సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదాయం సమకూర్చే శాఖల లక్ష్యాలపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. వార్షిక లక్ష్యాలను చేరుకోవడంలో శాఖల పనితీరును మెరుగుపరుచుకోవాలని చెప్పారు. సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి , ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.