నకిలీ విత్తనాలను సరఫరా చేసిన కంపెనీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
నకిలీ విత్తనాలను సరఫరా చేసిన కంపెనీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన గిరిజన రైతులకు న్యాయం చేయాలి
రాష్ట్ర డీజీపీకి బీజేపీ ఎస్టి మోర్చా రాష్ట్ర బృందం ఫిర్యాదు
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :
;తెలంగాణ డిజిపి కార్యాలయంలో డిజిపి జితేందర్ రెడ్డి నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన గిరిజన రైతులకు న్యాయం చేసే దిశగా చర్యలు చేపట్టాలని – బీజేపీ ST మోర్చా రాష్ట్ర బృందం డీజీపీకి ఫిర్యాదు చేసింది.ములుగు జిల్లా వెంకటాపురం ఏజెన్సీ ప్రాంతాల్లో నకిలీ విత్తనాల వల్ల తీవ్రంగా నష్టపోయిన గిరిజన రైతులకు న్యాయం కల్పించాలంటూ, బీజేపీ ST మోర్చా రాష్ట్ర బృందం ఈరోజు రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేసింది.ఈ సందర్భంగా ST మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు డా. కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ –“గత కొద్ది నెలలుగా సింజంత, హైటెక్, బాయర్, సిబివంటి కంపెనీలు నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతోనే ఈ మోసాలు జరుగుతున్నాయి. నాణ్యమైన విత్తనాలపై భరోసా ఉంచిన గిరిజన రైతులు పూర్తిగా నష్టపోయారు. అప్పుల్లో కూరుకుపోయిన కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన విషాదకర ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇది కేవలం వ్యవసాయ విఫలత కాదు – అమాయక గిరిజనులపై అవినీతి రాష్ట్ర ప్రభుత్వ కుట్ర. బాధ్యులైన కంపెనీలపై పీడియాక్ట్ కింద కేసులు నమోదు చేయాలి. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. భవిష్యత్తులో ఇటువంటి మోసాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలి,” అని తెలిపారు.1. 3000 ఎకరాలు పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించి 800 వందల మంది గిరిజన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి మరియు చనిపోయిన 5 గురు రైతుల కుటుంబాలకు తక్షణమే ఎక్స్గ్రేషియా చెల్లించాలి.2. నకిలీ విత్తనాలను సరఫరా చేసిన కంపెనీలపై మనీలాండరింగ్ యాక్ట్ , అలాగే యజమానులపై పీడియాక్ట్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.3. బాధ్యులైన ప్రభుత్వ అధికారులపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలి.4. భవిష్యత్తులో ఇలాంటి మోసాలు జరగకుండా నియంత్రణ చర్యలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని డిమండ్ చెసారు. “మంత్రి సీతక్క గారికి ఇసుక క్వారీలపై ఉన్న శ్రద్ధ, అందాల పోటీలపై ఉన్న ఆసక్తి గిరిజన రైతుల ఆత్మహత్యలపై ఏమాత్రం లేదని, వ్యవసాయ శాఖ మంత్రి కూడా స్పందించలేదని, ముఖ్యమంత్రి సమీక్షలు చేస్తున్నా, గిరిజన రైతుల విషయంలో పూర్తిగా విస్మరించారని, మంత్రివర్గంలో ఒక్క గిరిజన మంత్రిని కూడా నియమించని ఈ ప్రభుత్వ ధోరణి గిరిజనుల పట్ల అవమానకరంగా ఉంది,” అని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ ST మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శ రవి నాయక్ నేనావత్,రాష్ట్ర కార్యదర్శి కుంజా సంతోష్,మహేష్ రూపావత్,బానోత్ అనూష,రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.