ముంపు ప్రభావిత ప్రాంతాల పరిస్థితులపై ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎంతో కలిసి పరిశీలించిన కేంద్రమంత్రులు
ముంపు ప్రభావిత ప్రాంతాల పరిస్థితులపై ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎంతో కలిసి పరిశీలించిన కేంద్రమంత్రులు
ఏరియల్ సర్వేలో పాల్గొన్న కేంద్ర మంత్రులు, డిప్యూటీ సీఎం
ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టం,వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ , కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రులకు వివరించారు. అంతకుముందు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ , కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఏరియల్ సర్వే నిర్వహించారు. వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు , ప్రధానకార్యదర్శి శాంతికుమారి తదితరులు వెంట ఉన్నారు.