రష్మిక మందన్నాకు ఏమైందంటే?
రష్మిక మందన్నాకు ఏమైందంటే?
సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉండే రష్మిక మందన్నా అనూహ్యంగా నెల రోజులకుపైగా సోషల్ మీడియాకి దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా స్పందించింది రష్మిక. తాను సోషల్ మీడియాకి దూరం కావడానికి కారణమేంటో చెప్పింది. ఈ సందర్భంగా ఆమె అభిమానులకు పెద్ద షాకిచ్చింది.రష్మిక మందన్నా గాయాలపాలయ్యిందట. తనకు గాయాలు అయ్యాయని, అందువల్లే సోషల్ మీడియాకి దూరంగా ఉన్నట్టు చెప్పింది. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్) ద్వారా పోస్ట్ పెట్టింది రష్మిక మందన్నా. నేను సోషల్ మీడియాకి కనిపించి చాలా రోజులవుతుందని నాకు తెలుసు.గత నెలలో నేను పెద్దగా యాక్టివ్‌గా ఉండకపోవడానికి కారణం నాకు చిన్న ప్రమాదం జరిగింది. ఇప్పుడు నేను దాన్నుంచి కోలుకుంటున్నాను. డాక్టర్లు చెప్పినట్టుగానే ఇంట్లోనే ఉండి రెస్ట్న్నా తీసుకుంటున్న. ఇప్పుడు చాలా చురుకుగా ఉన్నాను. నా యాక్టివిటీస్ అన్ని బాగానే చూసుకుంటున్నాను.