వరదనీటిలో కొట్టుకుపోయిన కారు
వరదనీటిలో కొట్టుకుపోయిన కారు
వరదనీటిలో కొట్టుకుపోయిన కారు
ఖమ్మం జిల్లా కారేపల్లి గంగారం తాండలో విషాదం
సహాయం కోసం ఫోన్లు చేసిన తండ్రి, కూతురు
సకాలంలో చేరుకోకపోవడంతో వరదనీటి ఉదృతికి కొట్టుకుపోయిన కారు
తండ్రి, కూతురు మృతి
ప్రజాక్షేత్ర్ , క్రైం బ్యూరో
వరదనీటిలో ప్రయాణిస్తున్న కారు చిక్కుకుపోవడంతో తండ్రి, కూతురు మృతి చెందిన హృదయవిధారక సంఘటన ఇది. వివరాలలోకి వెళితే ..ఖమ్మం జిల్లా కారేపల్లి గంగారం తాండకు చెందిన సునావత్ మోతిలాల్ ఆయన కూతురు వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ అశ్విని. వ్యవసాయ శాస్త్రంలో బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్ డి, హైదరాబాదులోని ఇంక్రిషాట్ లో వ్యవసాయ శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తుంది. చత్తీస్ఘడ్ లోని రాయపూర్ లో జరిగే శాస్త్ర జాతీయ సదస్సు హాజరయ్యేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు తండ్రి , కూతుళ్ళు కారులో బయలుదేరారు. మార్గ మధ్యలో పురుషోత్తమయ్య గూడెం వద్ద వారు ప్రయాణిస్తున్న కారు వరదనీటిలో చిక్కుకుంది. దీంతో తమ పరిస్థితిని బంధువులకు స్నేహితులకు ఫోన్ ద్వారా వివరించినప్పటికీ సకాలంలో రాలేకపోవడంతో వరద నీటి ఉదృతికి కారు నీట మునిగింది. దీంతో డాక్టర్ అశ్విని మృత దేహం లభ్యం అయిన చాలాసేపటికి తండ్రి మోతీలాల్ మృతదేహం లభ్యమయ్యింది. అనేక పేద గిరిజన బాల బాలికలకు స్ఫూర్తి కలిగించి శాస్త్రవేత్తగా ఉజ్వల భవిష్యత్తుతో ముందుకు సాగుతున్న డాక్టర్ అశ్విని ఎంతో కష్టపడి తన కుమార్తె విద్యావేత్త ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఎన్నో కలలు కన్నా తండ్రి సునావత్ మోతిలాల్ తో పాటే కూతరు అశ్విని మృతిచెందడం అందరిని కలిచివేసింది. దీంతో ఖమ్మం జిల్లాలో కారేపల్లి గంగారం తాండలో విషాద ఛాయలు అలుముకున్నాయి.