సత్తా చాలిన ఏకాగ్ర చెస్ అకాడమీ క్రీడాకారులు

సత్తా చాలిన ఏకాగ్ర చెస్ అకాడమీ క్రీడాకారులు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
తెలంగాణా చెస్ అకాడమీ, ఐక్యూ చెస్ అకాడమీ నిర్వహించిన చెస్ టోర్నమెంట్స్ లో ఏకాగ్ర చెస్ అకాడమీ క్రీడాకారులు సత్తాచాటి ఛాంపియన్స్ గా నిలిచారని అకాడమీ చీఫ్ కోచ్ చైతన్య సురేష్ తెలిపారు. జూబ్లీహిల్స్ లోని ఏకాగ్ర చెస్ అకాడమీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఛాంపియన్ షిప్ టోర్నమెంట్స్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తెలంగాణా చెస్ అకాడమీ నిర్వహించిన టోర్నమెంట్లో అండర్-9 గర్ల్స్ విభాగంలో అన్య రంగినేని ఛాంపియన్ గా నిలవగా, యంగెస్ట్ ప్లేయర్ గా శ్వాన నిలవగా, ఐక్యూ చెస్ అకాడమీ నిర్వహించిన టోర్నమెంట్లో అండర్ 13 బాయ్స్ లో చరత్ అశ్విన్ ఛాంపియన్ గా నిలిచాడని తెలిపారు. అకాడమీలో సీఈఓ సందీప్ నాయుడు, చీఫ్ కోచ్ చైతన్యల శిక్షణ, ఎత్తుకు పై ఎత్తులను ఎలా వేయాలి, మైండ్ గేమ్ ఎలా ఆడాలని పలు అంశాలపై తీసుకున్న శ్రద్దతో ఛాంపియన్ గా నిలిచామని, గ్రాండ్ మాస్టర్స్ అవ్వడమే తమ లక్ష్యమని విజేతలు పేర్కొన్నారు. వరల్డ్ నెంబర్ టూగా మా అకాడమీ విద్యార్థిని నిలిచిందని, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మా అకాడమీ క్రీడాకారులు ఛాంపియన్స్ గా నిలవడం సంతోషంగా ఉందని చీఫ్ కోచ్ చైతన్య తెలిపారు.