సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారికి బంగారు బోనం
సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారికి బంగారు బోనం
సమర్పించిన భాగ్యనగర్ ఉమ్మడి కమిటీ చైర్మన్ గోపిశెట్టి రాఘవేందర్
ప్రజా క్షేత్ర్, చార్మినార్ , జూలై :
ఆషాఢమాసం పాతనగర బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని సప్తమాత్రికలకు సప్త బోనాలులో భాగంగా భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి గురువారం బంగారు బోనం సమర్పించారు. బ్యాండు చప్పుళ్ళు ...పోతరాజుల వీరంగాల నడుమ... శివసత్తుల నడుమ నిషా క్రాంతి బంగారు బోన మెత్తుకుని హరిబౌళి శ్రీ అక్కన్నమాదన్న శ్రీ మహంకాళి దేవాలయం నుంచి అంగరంగ వైభవంగా ఉరేగింపుగా బయలుదేరారు.అంతకుముందు అక్కన్నమాదన్న శ్రీ మహంకాళి అమ్మవారికి భాగ్యనగర్ ఉమ్మడిదేవాలయాల ఉరేగింపు కమిటీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీరాలం మండి నుంచి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయానికి చేరుకుని అక్కడ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. అనంతరం పట్టువస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ప్రధాన కార్యదర్శి గురునాథ్ రెడ్డి, శ్రీకాంత్, వివిధ ఆలయ కమిటీ ప్రతినిధులు దత్తాత్రేయ, సతీష్, బి.మారుతీయాదవ్, కె.వెంకటేష్, ప్రభాకర్, సదానంద్ యాదవ్, మధుసూధన్‌యాదవ్, ఆదర్ల మహేష్, రామ్‌దేవ్ అగర్వాల్, మోహన్, కృష్ణ, చేతన్‌కుమార్ సూరి తదితరులు పాల్గొన్నారు.