సీఎం రేవంత్ చొరవతో స్వదేశానికి చేరుకున్న ఎడారి ఒంటెల కాపరి రాథోడ్
సీఎం రేవంత్ చొరవతో స్వదేశానికి చేరుకున్న ఎడారి ఒంటెల కాపరి రాథోడ్
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :
కువైట్ - సౌదీ అరేబియా సరిహద్దుల్లోని ఎడారిలో ఒంటెల కాపరిగా చిత్రహింసలకు గురై రాష్ట్ర ప్రభుత్వ చొరవతో స్వదేశానికి చేరుకున్న నిర్మల్ జిల్లావాసి రాథోడ్ నాందేవ్ , వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. తన వేదనను తెలియజేస్తూ నాందేవ్ పంపిన వీడియోపై స్పందించిన ముఖ్యమంత్రి అతడిని తిరిగి దేశం కు రప్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఢిల్లీలోని విదేశాంగ శాఖతో సమన్వయం చేస్తూ కువైట్, సౌదీ అరేబియా రెండు దేశాల్లోని భారతీయ ఎంబసీలతో సంప్రదింపులు జరిపి నాందేవ్‌ను స్వదేశానికి చేరుకునేలా చొరవ తీసుకున్నారు.హైదరాబాద్‌కు క్షేమంగా చేరుకున్న నాందేవ్ తన కుటుంబ సభ్యులతో వచ్చి సీఎంని కలిశారు. ఈ సందర్భంగా మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రి, కాంగ్రెస్ ఎన్నారై సెల్ నాయకులు మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావు, స్వదేశ్ పరికిపండ్ల, నంగి దేవేందర్ తదితరులు ఉన్నారు.