DSC-2024లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలనను ఈ నెల 5లోపు పూర్తి చేయండి :రేవంత్ రెడ్డి
DSC-2024లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలనను ఈ నెల 5లోపు పూర్తి చేయండి :రేవంత్ రెడ్డి
ప్రజాక్షేత్ర్ , వెబ్ న్యూస్
డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ DSC-2024లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలనను ఈ నెల 5 వ తేదీలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి నిర్వహించిన డీఎస్సీ ఫలితాలను మూడు రోజుల కిందట ముఖ్యమంత్రి విడుదల చేశారు. దసరా పండుగ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 9 వ తేదీన వారందరికీ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను అందించాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు. సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో మాట్లాడిన ముఖ్యమంత్రి నిర్ధేశించిన గడువులోగా సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే 9090 మంది అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయిందని విద్యా శాఖ అధికారులు సీఎంకు వివరించారు.