అంతరిస్తున్న వృక్షజాతుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

అంతరిస్తున్న వృక్షజాతుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

అంతరిస్తున్న వృక్షజాతుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

-విశ్రాంత ఆచార్యులు మనోహరా చారి

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

పర్యావరణం పట్ల ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని, ముఖ్యంగా వృక్షశాస్త్ర విద్యార్థులు శాస్త్రీయ పరిశోధనల ద్వారా జీవవైవిధ్యాన్ని,  జీవ పరిణామశాస్త్రాన్ని అధ్యయనం చేయాలని విశ్రాంత ఆచార్యులు మనోహరా చారి అన్నారు.  వృక్ష వర్గీకరణ, హెర్బేరియం, ఆధునిక పద్ధతులపై అధ్యాపకులకు, విద్యార్థులకు సిటీ కళాశాల వృక్ష శాస్త్ర విభాగం నిర్వహించిన రెండు రోజుల కార్యశాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మనకు తెలియకుండానే మన వృక్షజాతులు అంతరిస్తున్నాయని,  కొన్నింటిపై విదేశీయులు పేటెంట్లు పొందుతున్నారని, దీనికి ప్రధాన కారణం మనకు పర్యావరణం పట్ల ఉన్న అవగాహన లోపమన్నారు. భారతీయ వృక్ష పరిశోధనా సంస్థ, కలకత్తా డైరెక్టర్ మావో ఆన్ లైన్ లో మాట్లాడుతూ మొక్కల వర్గీకరణ, టిష్యూ కల్చర్ ఎలా పునరుత్పత్తి చేయవచ్చో వివరించారు. అనంతరం శాస్త్రవేత్త సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రిమోట్ సెన్సింగ్ ద్వారా జీవావరణాన్ని గమనించటం, పరిశోధించడం ద్వారా ప్రస్తుతానికి మాత్రమే కాక ప్రాచీన కాలంలో వృక్షజాతులు ఎన్ని ఉండేవో, ఎన్ని అంతరించిపోయాయో తెలుసుకోవచ్చని,  భవిష్యత్తులో పరిస్థితుల గురించి పరిశోధనకు ఆధునిక సాంకేతికత ఉపయోగపడుతుందని అన్నారు. దక్కన్ పీఠభూమి రాష్ట్రాలకు ఒక ప్రధాన పరిశోధన సంస్థగా ఉన్న భారతీయ వృక్ష పరిశోధనా సంస్థ హైదరాబాద్ విభాగానికి డైరెక్టర్ గా ఉన్న రసింగం మాట్లాడుతూ విభాగం చేస్తున్న కృషి గురించి తెలియజేశారు. అందులో విద్యార్థులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు గల అవకాశాలను వివరించారు. అనంతరం ప్రిన్సిపాల్ ఆచార్య బాల భాస్కర్ మాట్లాడుతూ వృక్ష శాస్త్ర విభాగం అరుదైన కార్యశాల నిర్వహిస్తున్నదని, నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. ఇతర కాలేజీల నుండి హాజరైన అధ్యాపకులు, విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.