అబద్ధాలు చెప్పడంలో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అగ్రగామి: హరీష్ రావు
అబద్ధాలు చెప్పడంలో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అగ్రగామి: హరీష్ రావు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 2
అబద్ధాలు చెప్పడంలో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అగ్రగామి అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అభివృద్ధిలో మాజీ సిఎం కెసిఆర్ అగ్రగామి అని అన్నారు. హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ..బిఆర్ఎస్ ఒంటరిగానే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి అందాల పోటీలపై రివ్యూ చేశారు తప్ప..రైతుల ధాన్యంపై మాత్రం రివ్యూ చేయలేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రూ.21 వేల కోట్ల వడ్డీలేని రుణాలు..మహిళలకు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కెసిఆర్ ఆనవాళ్లను ఎవరూ చెరిపివేయలేరని హరీష్ రావు పేర్కొన్నారు.