ఉప్పుగూడ బోనాలలో పాల్గొనాలని స్వామి గౌడ్ కు ఆహ్వానం

ఉప్పుగూడ బోనాలలో పాల్గొనాలని స్వామి గౌడ్ కు ఆహ్వానం

ఉప్పుగూడ బోనాలలో పాల్గొనాలని స్వామి గౌడ్ కు ఆహ్వానం

ప్రజా క్షేత్ర్, చార్మినార్ : 

ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయ 76వ వార్షిక బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 20 వ తేదీన జరుగనున్న బోనాల ఉత్సవాలలో పాల్గొనాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర మాజీ లెజిస్టేటివ్ కౌన్సిల్ చైర్మన్  కనకమామిడి స్వామి గౌడ్ ని ఆలయ కమిటీ అధ్యక్షులు జనగామ మధుసూదన్ గౌడ్ బృందం మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్బంగా ముందుగా స్వామి గౌడ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఉప్పుగూడ శ్రీ మహంకాళి ఆలయంలో ఈ సంవత్సరము బోనాల ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా భక్తిశ్రద్ధలతో జరుపనున్నట్లు, అదేవిధంగా  ఈ నెల 16 వ తేదీన బుధవారం అమ్మవారి శాకంబరీ దేవి అలంకారాన్ని పురస్కరించుకొని అమ్మవారి దర్శనార్థమై ఆలయానికి రావాలని విజ్ఞప్తి చేశారు.