కె.సి.ఆర్ ని మర్యాదపూర్వకంగా కలసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

కె.సి.ఆర్ ని మర్యాదపూర్వకంగా కలసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ని మర్యాదపూర్వకంగా కలసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  ,జిల్లా నేతలు.
               
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఏం.ఎల్.సి నవీన్ రెడ్డి,మాజీ ఎం.ఎల్.ఏలు రావుల.చంద్రశేఖర్ రెడ్డి,జైపాల్ యాదవ్,గువ్వల బాలరాజు లు శనివారం నందినగర్ నివాసంలో  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కె.సి.ఆర్  ఆరోగ్య,యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొద్దిసేపు భేటీ అయిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బృందంతో కె.సి.ఆర్ పార్టీ నిర్మాణం,రాష్ట వ్యాప్తంగా ప్రజల సమస్యలు,జిల్లాలో పార్టీ బలోపేతం గురించి చర్చించి పలు సూచనలు చేశారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సాధకులు తెలంగాణ అభివృద్ధి ప్రదాత మాకు మార్గదర్శకులు కె.సి.ఆర్ అని వారి నాయకత్వం మాకు ప్రజలకు శ్రీరామరక్ష అని కొనియాడారు