చర్చకు రావడానికి రేవంత్ కి దమ్ము లేదా?... కేటీఆర్

చర్చకు రావడానికి రేవంత్ కి దమ్ము లేదా?... కేటీఆర్

చర్చకు రావడానికి రేవంత్ కి దమ్ము లేదా?... కేటీఆర్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, జూలై 6 : 
18 నెలలుగా రాష్ట్రంలోని 70 లక్షల రైతులు, కోట్లాది ప్రజలను నోటికొచ్చిన హామీలతో మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మొత్తం 420 హామీలిచ్చి, రచ్చ చేశారు కానీ చర్చకు రమ్మంటే పరార్ అవుతారని సెటైర్లు వేశారు. కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా అని సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. ఆ సవాల్ స్వీకరించడంతో పాటు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఉదయం 11 గంటలకు చర్చకు రావాలని సూచించాం. మాట మీద నిలబడని నేత రేవంత్ రెడ్డి కనుక ప్రెస్ క్లబ్ లో మేం హాల్ బుక్ చేసి చర్చకు రమ్మని పిలిస్తే ఏ నేత కూడా రాలేదన్నారు.ఏ బేసిన్ ఏ నదిలో ఉందో కూడా తెలియని నేత తెలంగాణ ముఖ్యమంత్రా అని జనం నవ్వుకుంటున్నారు. నీళ్లు , నిధులు, నియామకాలు తెలంగాణ నినాదం. వీటిని రేవంత్ రెడ్డి ఎలా ఫాలో అవుతున్నాడంటే.. ఏపీ సీఎం చంద్రబాబుకు కృష్ణా, గోదావరి నీళ్లు ఇస్తున్నాడు. కోవర్టు పాలన నడుస్తోంది. నీళ్లు ఆంధ్రాకు పోతే, నిధులు ఢిల్లీకి పోతున్నాయి. నియామకాలు ఆయన తొత్తులకు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన ఢిల్లీ పర్యటనపై ఓ కాంగ్రెస్ నేతతో మాట్లాడాను. రేవంత్ ఢిల్లీ ఎందుకు పోయాడని అడిగితే ఎరువుల బస్తాల కోసం ఢిల్లీకి వెళ్లాడని తెలిసింది. దూడకు గడ్డెయ్యాలని వెనుకటికి ఒకడు తాటిచెట్టు ఎక్కాడంట. రేవంత్ ఏ బస్తాలు తీసుకుని ఢిల్లీకి పోతున్నాడు. ఆయన ఓ పేటీఎం. పేమెంట్ కోటాలో సీఎం పదవి తెచ్చుకున్నాడు. రైతులు, మహిళలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, యువతపై ప్రేమ లేదు. హామీలు అమలు చేస్తలేదు. రైతు బంధు అయిపోయిందన్నారు. రేవంత్ రెడ్డి నియోజకవర్గం కోడంగల్ లో 670 మంది రైతులకు రైతు భరోసా రాని వారి జాబితా ఇదీ. రుణమాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకున్న 600 మంది రైతుల వివరాలు మేం వెల్లడిస్తున్నాం. ఎరువుల కొరతతో రైతులు అల్లాడుతున్నారు. ఒక్క ఆధార్ కు ఒక్క బస్తా ఇస్తాడంట. గత రోజులు తెస్తామన్నాడు. నిజంగానే కరెంట్ కోత, ఎరువులు, విత్తనాల కోసం లైన్లలో నిల్చునే రోజులు తెచ్చాడు. ఇందిరమ్మ రాజ్యం అంటే అక్రమ కేసులు, అణచివేతలు, ఎమర్జెన్సీని గుర్తుకుతెచ్చేలా పాలన చేస్తున్నాడు. నల్లబాలు అనే సోషల్ మీడియా వ్యక్తి ప్రశ్నించాడని కేసు పెట్టి అరెస్ట్ చేశారు. కేసీఆర్ హయాంలో రుణమాఫీ జరిగింది. పంట కాలానికి ముందే రైతు బంధు నగదు ఏ ఇబ్బంది లేకుండా వారి ఖాతాల్లో జమచేశాం. ఇప్పుడు మళ్లీ పైరవీల పాలన వచ్చింది. రైతుల ఆత్మహత్యలతో కూడా రేవంత్ రెడ్డి చలించడం లేదు. వర్షాకాలం వచ్చినా పంపు హౌజ్ లు బోర్లు ఆన్ చేసి నీళ్లు వదలడం లేదు. రైతులు కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది. ఈరోజు చర్చకు రాకపోయినా ఎప్పుడు చర్చకు వస్తారో డేట్, ప్లేస్ చెప్పాలని ’ మరోసారి ఛాలెంజ్ చేశారు కేటీఆర్.
మీ ఇంటికి రమ్మంటావా..... 
రైతుల సంక్షేమంపై రేవంత్ అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే 600మందికి పైగా రైతులకు రైతు బంధు రాలేదన్నారు. రైతుల మరణాల లిస్టు కూడా రెడీగా ఉందని చెప్పారు. రైతుల సంక్షేమంపై చర్చించడానికి రేవంత్ స్థాయికి కేసీఆర్ అవసరం లేదని అన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌కు కేటీఆర్ మరో సవాల్ విసిరారు. ‘‘సీఎం చర్చ ఎక్కడ పెట్టినా ఒకే. చర్చ కోసం అవసరమైతే రేవంత్ తన ఇంటికి రమ్మన్నా వెళ్తా. చర్చించే సత్తా లేకపోతే మరోసారి సవాళ్లు విసరొద్దు’’ అని కేటీఆర్ అన్నారు. దమ్ముంటే రేవంత్ చర్చకు రావాలి.. లేదా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి హామీలు అమలుచేయకుండా రంకెలు వేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు పక్కా అమలు చేస్తామంటూ బాండ్ పేపర్లు రాసిచ్చారు.. ఇప్పుడు అవి ఎటుపోయాయంటూ ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణను సాధిస్తే.. రేవంత్ పాలనలో నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి తరలిపోతున్నాయని ఆరోపించారు. ఎరువుల బస్తాల కోసం రేవంత్ ఢిల్లీ వెళ్లలేదని.. ఢిల్లీ పెద్దల కోసం ఏం బస్తాలు తీసుకెళ్లారో అందరికీ తెలుసని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే అణిచివేతలు, అక్రమ కేసులు అన్న కేటీఆర్.. కర్రు కాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లారు.  రైతు సంక్షేమంపై అసెంబ్లీ వేదికగా చర్చకు సిద్ధమని ప్రకటించారు. 9 రోజుల్లో రూ.9వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశామన్నారు. అసెంబ్లీకి రమ్మంటే బీఆర్ఎస్ నేతలు పారిపోతున్నారని విమర్శించారు. రైతుల సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ పెట్టాలని కేసీఆర్ లేఖ రాస్తే పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కేటీఆర్ ముందు కేసీఆర్‌తో లేఖ రాయించాలని సూచించారు.