శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయ ఆభివృద్ది పనుల ప్రారంభానికి శృంగేరికి వెళ్ళిన అధికార యంత్రాంగం
శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయ ఆభివృద్ది పనుల ప్రారంభానికి శృంగేరికి వెళ్ళిన అధికార యంత్రాంగం
శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయ ఆభివృద్ది పనుల ప్రారంభానికి శృంగేరికి వెళ్ళిన అధికార యంత్రాంగం
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వేములవాడ శ్రీ రాజ రాజేశ్వరస్వామి వారి దేవాలయ ఆభివృద్ది పనులు ప్రారంభించేందుకు గాను శృంగేరి పిఠం వారి ఆజ్ఞ కోసం ఉన్నత స్థాయి బృందం శృంగేరి చేరుకుంది. ఈ బృందంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారి((ఓఎస్డీ) వేముల శ్రీనివాసులు, రాజన్న దేవస్థానం ఈవో శ్రీ వినోద్ రెడ్డి, దేవాదాయ శాఖ స్థపతి శ్రీ వల్లీనాయగం, శృంగేరి పీఠం తెలంగాణ భాధ్యులు శ్రీ రాధాకృష్ణ తో పాటు దేవస్థానం అధికారులు, అర్చకులు ఉన్నారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ప్రజాప్రభుత్వం వార్షిక బడ్జెట్ లో రూ.50 కోట్ల నిధులు కేటాయించిన విషయం విథితమే. వేములవాడ ఎమ్మెల్యే నేతృత్వంలో ఆలయ అర్చకులు, అధికారులు ఆగస్టు 30న సచివాలయంలో ముఖ్యమంత్రి ని కలిసిన సందర్భంలో శృంగేరి పీఠం అనుమతి అంశం చర్చకు రాగా, వెంటనే అనుమతి తీసుకుని అందుకు సంబంధించిన పనులను చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు ఉన్నత స్థాయి బృందం శృంగేరి వెళ్లింది.