భాగ్యలక్ష్మి దేవాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు పూజలు

భాగ్యలక్ష్మి దేవాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు పూజలు

పార్టీ నాకు గొప్ప అవకాశం ఇచ్చింది
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
పార్టీ నాకు గొప్ప అవకాశం ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు అన్నారు. శనివారం నాడు అయన  పాత బస్తి భాగ్యలక్షి ఆలయంలో పూజలు జరిపారు.  తరువాత మీడియాతో మాట్లాడారు. ఇవాళ అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకుంటున్నాను. కిషన్ రెడ్డి నేతృత్వం అనేక సంవత్సరాలుగా రాష్ట్ర బిజెపికి మార్గదర్శకం అయింది. కిషన్ రెడ్డి నుంచి అధ్యక్షుడిగా చార్జ్ తీసుకుంటున్నందుకు గొప్పగా అనిపిస్తుంది. సంతోషంగా ఉంది. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు తెలంగాణ ప్రజలపై నిండుగా ఉండాలి. తెలంగాణ సస్యశ్యామలoగా ఉండాలని, తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని కోరుకున్నా. తెలంగాణ ప్రజలకు బిజెపి అండగా నిలబడుతుంది. అందుకు శక్తినివ్వాలని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నానని అన్నారు.