మహాటివి ఆఫీసు చిన్న గ్లాస్ పగిలితేనే రాద్దాంతం చేస్తున్న రేవంత్ రెడ్డి, చంద్రబాబు : గెల్లు శ్రీనివాస్ యాదవ్
మహాటివి ఆఫీసు చిన్న గ్లాస్ పగిలితేనే రాద్దాంతం చేస్తున్న రేవంత్ రెడ్డి, చంద్రబాబు
కేటీఆర్ పైన, బీఆర్ఎస్ నేతలపైన అసత్య ప్రచారం చేస్తే.. ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం
బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
మహాటీవీ ఆఫీసులో చిన్న గ్లాస్ పగులుతేనే భాదపడుతు, ఇక్కడ రేవంత్ రెడ్డి, అక్కడ చంద్రబాబు నాయుడు హైరానా చేస్తున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు.ఇంతకుముందు చాలాసార్లు మహాటీవీ యాజమాన్యం మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై వ్యక్తిగతంగా ఆరోపణలు చేశారు. కేటిఆర్ తో పాటు వారి కుటుంబ సభ్యుల పరువుతీసే విధంగా తమ టీవీలో ప్రసారాలు చేశారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కార్యకర్తలు అనేకసార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక సెక్షన్ ఆఫ్ ఆంధ్రా మీడియా పనిగట్టుకుని కేసీఆర్ ని, కేటీఆర్ ని బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసే కుట్ర చేస్తున్నారు. మేము కేసులకు భయపడం, కేటీఆర్ పైన, బీఆర్ఎస్ నేతలపైన అసత్య ప్రచారం చేస్తే.. ఖచ్చితంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.