బిఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు : బిజెపి ఎంపి రఘునందన్ రావు

బిఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు : బిజెపి ఎంపి రఘునందన్ రావు

బిఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు
బిఆర్ఎస్ గా మారిన టిఆర్ఎస్ కు ప్రజలు విఆర్ఎస్ ఇచ్చారు
బిజెపి ఎంపి రఘునందన్ రావు  
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :

బిఆర్ఎస్ కు పోటీ చేయడానికి కనీసం అభ్యర్థులు లేరని బిజెపి ఎంపి రఘునందన్ రావు   చురకలంటించారు. బిఆర్ఎస్ గా మారిన టిఆర్ఎస్ కు ప్రజలు విఆర్ఎస్ ఇచ్చారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు  ) బిజెపికి దగ్గరవుతున్నారని, బిఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. జనం గుండె చప్పుడుగా బిజెపి మారిందని పేర్కొన్నారు. తనపై వ్యక్తిగతంగా బురద జల్లేందుకు యత్నిస్తున్నారని,  దొంగే దొంగా దొంగా అని అరిచినట్లుందని బిఆర్ఎస్ తీరు అని విమర్శించారు. తెలంగాణలో బిఆర్ఎస్ ఎక్కడా లేదని, బిఆర్ఎస్ చెల్లని రూపాయని అన్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న పెయిడ్ బ్యాచ్ లపై కేసులు నమోదు చేయాలని సూచించారు. పెయిడ్ ఆర్టిస్టులతో పోస్టులు పెట్టిస్తున్నారని, ఎమ్మెల్యే కవిత కూడా ఆరోపించారని చెప్పారు. తెలంగాణలో మాజీ సిఎం కెసిఆర్ కుటుంబ ఆస్తులే పెరిగాయని రఘునందన్ రావు స్పష్టం చేశారు.