బీసీలలో ఐక్యత లోపించింది : టీపీసీసీ చీఫ్
బీసీలలో ఐక్యత లోపించింది : టీపీసీసీ చీఫ్
బీసీలలో ఐక్యత లోపించింది
పార్టీలకు అతీతంగా ఏకం కావాలి టీపీసీసీ చీఫ్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
బీసీలలో ఐక్యత లోపించిందని బీసీలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పార్టీలకు అతీతంగా బీసీలు ఏకం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. నాంపల్లిలో జరిగిన ఓబీసీ పోరుబాట పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ. కేంద్రం తీసుకున్న కుల గణన నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయంగా అభివర్ణించారు. కుల గణనతో తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారిందన్నారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ దేశంలోని వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోగలిగారన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనల్లో నుంచి పుట్టిందే కుల సర్వే అన్నారు. చాలా వరకు బీసీలను ఓటు సాధనాలుగానే చూశారని.. మా వాటా మాకు కావాలి అనే స్థాయికి బీసీలు ఎదిగారు. సమాజంలో ఎవరి వాట వారికే సిద్ధాంతానికి కట్టుబడి పారదర్శకంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుల సర్వే నిర్వహించిందన్నారు. కుల సర్వేను వ్యతిరేకించిన కేంద్రంలోని బీజేపీ సైతం జనగణనతో పాటు కుల గణన చేపడతామని ప్రకటించింది. ఖర్గే,రాహుల్ గాంధీ సమక్షంలో కుల సర్వే పై దేశ వ్యాప్తంగా చేపడుతామన్నారు.