పద్మశ్రీ మొగిలయ్య కు 600 గజాల స్థలం పత్రాలను అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి
పద్మశ్రీ మొగిలయ్య కు 600 గజాల స్థలం పత్రాలను అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రజాక్షేత్ర్, వెబ్ న్యూస్
ప్రముఖ కిన్నెర వాయిద్య కారుడు పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం ఇంటి స్థలం ధ్రువపత్రాలను అందజేశారు. ప్రభుత్వం హయత్ నగర్ లో 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయించగా, అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో కలిసి సీఎం అందించారు. స్థలం పత్రాలను అందించినందుకు ఈ సందర్భంగా కిన్నెర మొగిలయ్య సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.