గాంధీ భవన్ ప్రజా దర్బార్ లో 109 కి పైగా ప్రజల నుంచి వినతులు

గాంధీ భవన్ ప్రజా దర్బార్ లో 109 కి పైగా ప్రజల నుంచి వినతులు

గాంధీ భవన్ ప్రజా దర్బార్ లో 109 కి పైగా ప్రజల నుంచి వినతులు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 11 :
బుదవారం గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షులు ప్రవేశపెట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్బంగా  109 కి పైగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.  రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వినతులు అధికంగా వచ్చాయి.అనంతరం మంత్రి మీడియా సమావేశం లో మాట్లాడుతూ  ప్రజల సమస్యలను ఆయా శాఖల అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేశారు.  సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులపై నమ్మకంతో ప్రజలు పెద్ద ఎత్తున గాంధీ భవన్‌కి తరలివచ్చారు.వచ్చిన అన్ని వినతులను పరిశీలించి తగిన పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు