కొమ్మినేనికి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు

కొమ్మినేనికి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు

కొమ్మినేనికి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు
ప్రజా క్షేత్ర్, న్యూఢిల్లీ :
 ఏపీ రాజధాని అమరావతి ప్రాంత మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీం కోర్టు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. కొమ్మినేని  బెయిల్  పిటీషన్ కింది కోర్టులో పెండింగ్‌లో ఉండగానే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిపిన జస్టిస్ పీకే మిశ్రా ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.  మరోసారి అమరావతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయవద్దని కొమ్మినేనికి సుప్రీం ధర్మాసనం సూచించింది. భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. కింది కోర్టు విధించిన షరతులకు లోబడే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. విడుదలకు సంబంధించిన అన్ని నిబంధనలు ట్రయల్ కోర్టు ఇస్తుందని ధర్మాసనం తెలిపింది.