గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
గల్ఫ్ దేశాల్లో కార్మికులెవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా
ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో :
తెలంగాణకు చెందిన గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ , విప్ ఆది శ్రీనివాస్, గల్ఫ్ సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు.ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు, గల్ఫ్ దేశాల్లో కార్మికులెవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇచ్చే విధంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే, గల్ఫ్ కార్మికుల కష్టనష్టాలను అధ్యయనం చేయడానికి ఒక సలహా కమిటీని ఏర్పాటు చేయడం, గల్ఫ్ వర్కర్ల కుటుంబాల సమస్యల పరిష్కారానికి ప్రవాసీ ప్రజావాణిని ఏర్పాటు చేయడం, వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్ల అడ్మిషన్లలో ప్రాధాన్యతనివ్వడం వంటి అంశాలతో ప్రభుత్వం జీవో జారీ చేసింది.ఈ నేపథ్యంలో గల్ఫ్ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.