ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి సంగీత సాహిత్య నృత్యోత్సవం
వరంగల్ లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి సంగీత సాహిత్య నృత్యోత్సవం
ప్రజాక్షేత్ర్, వరంగల్ బ్యూరో
వరంగల్ పట్టణం లోని రాధాకృష్ణ గార్డెన్స్ (వరంగల్ చౌరస్తా) లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సహకారంతో బజ్జూరి ఆర్గనైజేషన్ కృష్ణ సొసైటీ, కాకతీయ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో రెండు రోజులు పాటు నిర్వహించిన సంగీత సాహిత్య నృత్యోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు మంత్రి కొండా సురేఖ, వరంగల్ పట్టణ మేయర్ గుండు సుధారాణి లు ముఖ్య అతిథులుగా పాల్గొ, వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వరంగల్ కు చెందిన (కళాధార కూచిపూడి నృత్య కళాక్షేత్రం ) కాలేశ్వరం అనూష రాజ్ కుమార్ శర్మ వారి శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన అధ్యంతం కన్నుల పండుగగా సాగింది. చిన్నపిల్లలు కృష్ణుడు, గోపిక వేషధారణలో చేసిన నృత్యాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం నృత్య బృందం వారికి సర్టిఫికెట్ మెమొంటోలు తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాధార కూచిపూడి నృత్య కళాక్షేత్రం కాళేశ్వరం అనూష రాజ్ కుమార్ శర్మ, వారి శిష్య బృందం శివానిక, శ్రీజ, రితన్య, సాన్విక, లౌక్య, నగీషా, రుహిక, మాన్వికా, సాన్విక, వేదిక, సమీక్ష తదితరులు పాల్గొన్నారు.