రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ కార్డుల జారీకై ప్రతిపాదనలు

రేషన్ కార్డుతో సంబంధం లేకుండా  ఆరోగ్యశ్రీ కార్డుల జారీకై ప్రతిపాదనలు

రేషన్ కార్డుతో సంబంధం లేకుండా  ఆరోగ్యశ్రీ కార్డుల జారీకై ప్రతిపాదనలు

రేషన్ కార్డు ప్రాతిపదికన హెల్త్ కార్డు జారీ విదానాన్ని డిలింక్ చేస్తే రేషన్ బియ్యం సగ్లింగ్ ను అరికట్టవచ్చు

 రాష్ట్ర  శాసనసభ పిటిషన్ల కమిటీ చైర్మన్ & శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె. రఘురామకృష్ణరాజు

ప్రజా క్షేత్ర్, అమరావతి, జూన్ 3:  
తెల్ల  రేషన్ కార్డుతో సంబందం లేకుండా   ఎన్.టి.ఆర్.ఆరోగ్యశ్రీ కార్డులను జారీచేస్తే  రేషన్ బియ్యం స్మగ్లింగ్ ను పూర్తి స్థాయిలో అరికట్టే అవకాశం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ అభిప్రాయ పడుతున్నట్లు ఆ కమిటీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె. రఘు రామకృష్ణ రాజు తెలిపారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి తమ కమిటీ త్వరలోనే ప్రతిపాదలను పంపనున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం రాష్ట్ర శాసన సభలో ప్రాంగణంలోని తమ ఛాంబరులో కమిటీ సభ్యులు  అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మరియు విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే పి విష్ణు కుమార్ రాజుతో కలసి ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడిచేశారు.  రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు మినహా తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఏడాదికి రూ.25 లక్షల వరకూ  ఆరోగ్య భీమాని ప్రభుత్వం కల్పిస్తున్న నేపథ్యంలో ఎన్.టి.ఆర్.ఆరోగ్యశ్రీ కార్డులను పొందేందుకు ప్రజలకు పెద్ద ఎత్తున మక్కువ చూపుతున్నారన్నారు. ఇందుకై వారికి  తెల్ల రేషన్ కార్డు అవసరం లేకపోయినా పొందుతున్నారున్నారు.   ప్రతి ప్రభుత్వ పథకాని  తెల్ల రేషన్ కార్డే ప్రాతిపదికగా  తీసుకోవడం వల్ల తెల్ల  రేషన్ కార్డు అవసరం లేనివారు కూడా ఈ కార్డును తీసుకోవడం వల్ల  రేషన్ బియ్యం దుర్వినియోగం అవ్వడమే  కాకుండా భారీ ఎత్తున రేషన్ బియ్యం స్మగ్లింగ్ కు దారితీస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా ఒప్పుకుంటూ  హెల్త్ కార్డు జారీ విషయంలో  తెల్ల రేషన్ కార్డును  డిలింక్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్ అభిప్రాయాన్ని వారు కూడా వ్యక్తం చేశారని ఆయన తెలిపారు.  రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.70 కోట్ల ప్యామిలీలు ఉన్నాయని, వాటిలో దాదాపు 1.48 కోట్ల కుటుంబాలకు   తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎటు వంటి సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీకై  దాదాపు రూ.5,100 కోట్లను వెచ్చిస్తున్నదని, దీనిలో దాదాపు రూ.2 వేల కోట్ల వరకూ ఆదాచేసే అవకాశం ఉంటుందన్నారు.  ఆ డబ్బులను విద్య, వైద్యంపై ఖర్చుపెట్టేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక్క ఎన్.టి.ఆర్.ఆరోగ్యశ్రీ కార్డులకే కాకుండా ఎన్.టి.ఆర్.భరోసా ఫించన్లు మరియు ఇతర ప్రభుత్వ పథకాల మంజూరీ విషయంలో రేషన్ కార్డులను  డిలింక్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ సమావేశాన్ని నెలకు రెండు సార్లు నిర్వహిస్తామని,  శాంతి భద్రతల సమస్యలతో పాటు ప్రజలకు, సమాజానికి హితవు చేసే సామూహిక సమస్యలను పరిష్కరించే అంశంపై ఈ కమిటీ ప్రత్యేక శ్రద్ద చూపుతుందని ఆయన తెలిపారు. ఆయా సమస్యలకు సంబందించి విజ్ఞాపనలను స్థానిక శాసన సభ్యుల ద్వారా  ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ అందజేస్తే వాటి పరిష్కానికి  తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. అంతకు ముందుకు  శాసన సభా ప్రాంగణంలో చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె. రఘు రామకృష్ణ రాజు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ సమావేశంలో శాసన సభ్యులు కొణతాల రామకృష్ణ, పి విష్ణు కుమార్ రాజు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తో పాటు రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంభ సంక్షేమ శాఖ స్పెషల్ సి.ఎస్. ఎం.టి.కృష్ణబాబు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరబౌ గౌర్ మరియు శాసన సభ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర, డిప్యుటీ సెక్రటరీ కె.రాజకుమార్, అసిస్టెంట్ సెక్రటరీ ఆర్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.