కేసీ కెనాల్ పై శిల్పా వెంచర్ వేసి 7 వేల ఎకరాలకు రైతులకు నీరు వెళ్లకుండా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా
కేసీ కెనాల్ పై శిల్పా వెంచర్ వేసి 7 వేల ఎకరాలకు రైతులకు నీరు వెళ్లకుండా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా
జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
ప్రజా క్షేత్ర్, ఆళ్లగడ్డ :
ఆళ్లగడ్డలో శిల్పా వెంచర్ పేరుతో కేసీ కెనాల్ ను ఆక్రమించుకొని కేసీ కెనాల్ పై శిల్పా వెంచర్ వేసి 7 వేల ఎకరాలకు రైతులకు నీరు వెళ్లకుండా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోని కేసులు పెట్టాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు. శిల్ప వెంచర్ ఆళ్లగడ్డలోనే కాదు నంద్యాలలో కడపలో కూడ కేసీ కెనాల్ ను ఆక్రమించుకొని రైతులకు నీరు వెళ్లకుండా ఆక్రమించుకొని వెంచర్లు వేశారు. వీటన్నిటి పైన తగు చర్యలు తీసుకోవాలని నేను అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. హైకోర్టు నుంచి కూడ ఆర్డర్స్ తీసుకొని రావడం జరిగింది అని కచ్చితంగా నేను అసెంబ్లీ వెళ్లే లోపు వారిపై చర్యలు తీసుకోవాలని లేకుంటే 200 మంది రైతులు అలాగే శిల్పా వెంచర్ లో ఇళ్ళు తీసుకొని మోసపోయిన బాధిత కుటుంబాలను తీసుకొని ధర్నాకు దిగాల్సి వస్తుందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హెచ్చరించారు. అలాగే ఆళ్లగడ్డ రైతులకు చివరి ఆయకట్టు వరకు నీరు అందేలాగా చూడాలని, ఎక్కువగా పంటలు వేసేది ఆళ్లగడ్డ రైతులే అని వారెవరు నష్టపోకూడదని ప్రతి ఒక్క రైతుకు నీరు అందేలాగా చూడాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అధికారులకు తెలియజేశారు...