శ్రీశైలంలో బుల్లెట్ల కలకలం
శ్రీశైలంలో బుల్లెట్ల కలకలం
ప్రజా క్షేత్ర్, శ్రీశైలం :
శ్రీశైలంలో బుల్లెట్లు కలకలం సృష్టించాయి. గుర్తుతెలియని వ్యక్తులు బుల్లెట్లు వదిలి వెళ్లినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలంలోని వాసవీసత్రం ఎదురు రోడ్డు డివైడర్ పై ఈ బుల్లెట్లు లభ్యమయ్యాయి. మొత్తం 9 పెద్ద సైజు బుల్లెట్లు, 4 చిన్న సైజు బుల్లెట్లు దొరికాయి. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. బుల్లెట్లతో పాటు 4 బాంబులు కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.