సరస్వతి పుష్కర ఆదాయం రెండు కోట్ల 83 లక్షలు.
సరస్వతి పుష్కర ఆదాయం రెండు కోట్ల 83 లక్షలు.
ప్రజా క్షేత్ర్, జయశంకర్ భూపాలపల్లి :
సరస్వతి నది పుష్కరాల సందర్బంగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి పుష్కరాలు 12 రోజులలో హుండీ ద్వారా రు.1,36,28,099 ఆదాయం వచ్చినట్లు హుండీల పర్యవేక్షణాధికారి నందనం కవిత తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి ఎస్ మహేష్, సహాయ కమీషనర్ ఆర్ సునిత పాల్గొన్నారు. గదుల అద్దె ద్వారా రు. 1,71,000, హోమముల ద్వారా రు.1,23,000, శీఘ్రదర్శనం ద్వారా రు. 5,60,000, ప్రసాదముల ద్వారా రు.138,36,552, హుండీల ఆదాయం రు. 1,36,28,099, మొత్తం రు. 2,83,18,651,మిశ్రమ బంగారు 15 గ్రాములు, మిశ్రమ వెండి 1-750 గ్రాములు వచ్చినట్లు పర్యవేక్షణాధికారి నందనం కవితవెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, పుష్కరాల ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాళేశ్వరం ఎస్సై తమాషా రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు.