రేవంత్ కు రూ.50లక్షల విరాళం చెక్కు అందజేసిన చిరంజీవి
రేవంత్ కు రూ.50లక్షల విరాళం చెక్కు అందజేసిన చిరంజీవి
ప్రజాక్షేత్ర్, వెబ్ న్యూస్
వరద బాధితుల సహాయార్థం అగ్రనటుడు, కేంద్ర మాజీ మంత్రి 'మెగాస్టార్' చిరంజీవి ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయలు విరాళం అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి జూబ్లీహిల్స్ నివాసంలో కలిసిన చిరంజీవి ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు. అలాగే తన కుమారుడు రామ్ చరణ్ తరపున మరో 50లక్షల రూపాయల చెక్కును కూడా #CMRFకు చిరంజీవి అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదార్యం చాటుకున్న చిరంజీవి కుటుంబానికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంలో సీఎం వెంట మంత్రి సీతక్క కూడా ఉన్నారు.