సినీ అవార్డులపై రెండు ప్రభుత్వాలు అవగాహనకు రావాలి : మురళీ మోహన్

సినీ అవార్డులపై రెండు ప్రభుత్వాలు అవగాహనకు రావాలి : మురళీ మోహన్

ఒకే సినిమాకు రెండు ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం బాగోదు
సినీ అవార్డులపై రెండు ప్రభుత్వాలు అవగాహనకు రావాలి
ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
ఒకే సినిమాకు రెండు ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం బాగోదని ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్   తెలిపారు. ఎపిలోనూ సినీ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందించే గద్దర్ అవార్డుల ప్రకటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీ అవార్డులపై రెండు ప్రభుత్వాలు అవగాహనకు రావాలని, ఒక ఏడాది తెలంగాణ, మరో ఏడాది ఎపి ప్రభుత్వం అవార్డులు ఇవ్వాలని సూచించారు. తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాలూ కావాలని, సినిమాలను తెలంగాణ, ఆంధ్రా అంటూ వేర్వేరుగా చూడొద్దని కోరారు. సినిమాకు సంబంధించి తెలుగు ప్రేక్షకులంతా ఒకటేనని, తెలుగు సినిమా  అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని హర్షం వ్యక్తం చేశారు. తెలుగు సినిమాలను మనకంటే ముందు అమెరికా వాళ్లు చూస్తున్నారని మురళీమోహన్ పేర్కొన్నారు.