అంగరంగ వైభవంగా తెలుగు సినీ రచయితల సంఘం త్రిదశాబ్ది వేడుకలు
అంగరంగ వైభవంగా తెలుగు సినీ రచయితల సంఘం త్రిదశాబ్ది వేడుకలు
హాజరయిన కె.రాఘవేంద్రరావు, మురళీమోహన్, డి.సురేష్‌బాబు, పరుచూరి గోపాల కృష్ణ , తనికెళ్ల భరణి
ప్రజాక్షేత్ర్ , ఫిలిం న్యూస్ :
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లోని కృష్ణ హాల్ లో తెలుగు సినీ రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ పరుచూరి గోపాల కృష్ణ ఆధ్వర్యంలో తెలుగు సినీ రచయితల సంఘం త్రిదశాబ్ది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి దర్శకులు కె. రాఘవేంద్ర రావు, సీనియర్ నటులు ఎం. మురళీ మోహన్ రావు, ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు,బి. గోపాల్ లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ముందుగా ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు, తెలుగు సినీ రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ పరుచూరి గోపాల కృష్ణ, బి. గోపాల్,సంఘం ప్రధాన కార్యదర్శి ఉమర్జీ అనూరాధ, కోశాధికారి నటరాజ గోపాల మూర్తి లు సంఘం మహిళా ప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సరస్వతి దేవికి పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా డి.లిట్ నీ, పి.హెచ్.డి లను గౌరవ డాక్టరేట్లను పొంది, రచయితల సంఘానికి తల మానికాలైన కవి మాణిక్యాలకు, జాతీయ అవార్డులు పొందిన కవి రాజులకు, రాష్ట్ర గీతాన్ని ఇచ్చిన కవి శ్రేష్టునికి దర్శకులు కె. రాఘవేంద్ర రావు, సీనియర్ నటులు ఎం. మురళీ మోహన్ రావు, ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు లు ఆత్మీయ సత్కారాలను అందజేశారు.
సమాజాన్ని ఉద్దరించడానికి సినిమాలురాస్తున్నాం : పరుచూరి గోపాల కృష్ణ
ఒకప్పుడు రేడియో రైటర్‌కు ఉన్న గౌరవం కూడా సినిమా రైటర్‌కు ఉండేది కాదు. నేను డాక్టర్ కావాలనే చాలా కోరిక నా తల్లిదండ్రులకు ఉండేది. నేను సూది మందు ఇవ్వకపోవచ్చు కానీ సూది మందు ప్రభావాన్ని అందిచకలిగినటువంటి మాటల తూటాలతో ఇవాళ సినిమాలకు రచన చేశాం. మొక్కే కదా అని పీకేస్తే ..పీక కోస్తాం .... తప్పు మావైపు ఉంది కదా అని తలదించుకునివెళ్తున్నాం..లేకపోతే తలలు తీసుకుని వెళ్లే వాళ్లం అని రాసిన డైలాగ్‌లు ప్రజల్లో ఇప్పటికే మెదులుతూనే ఉన్నాయి. సినిమా ఒక ఎంటర్టెయిన్ మెంట్ మాత్రమే కాదని ఇది ఎడ్యుకేషన్ కూడా అని ప్రపంచానికి చెప్పేవిధంగా తెలుగు సినిమా కథ సామాజిక దృష్టి అనే అంశంపైన 806 పేజీల పుస్తకంను రాశాను. ఎన్నో ఏళ్ళ నిరీక్షణ అనంతరం వచ్చిన డాక్టరేట్‌ను నా తల్లి ఆదండ్రులకు అంకితం ఇచ్చాను. సినిమా అనేది వినోదం కోసం కాదు.. విజ్ఞానం కోసమే అన్న విధంగా సినిమా కథలను రచించాలని చెప్పారు. సినిమాలు ఏదో నవ్వించడానికో ..కవ్వించడానికో.. నాలుగు స్టెప్పులు వేయించడానికో సినిమాలు రాయడంలేదని సమాజాన్ని ఉద్దరించడానికి సినిమాలు రాస్తున్నాం అని ధైర్యంగా చెప్పుకోవాలి.
సినిమాకు రచయితల సంఘం గుండెలాంటిది :
మురళీమోహన్
తెలుగు రచయితల సంఘం త్రిదశాబ్ది వేడుకల్లో ఇంతమంది రచయితలను ఒకే వేదికపై చూడడం చాలా సంతోషంగా ఉంది. ఏ సినిమాకు అయినా మూలం అనేది కథ. ఆ కథ ... మాటలు ఈ రెండు ఉంటేనే సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేది. సినిమాకు రచయితల సంఘం గుండెలాంటిది. ఆనారోగ్యంగా, ఆర్థికంగా ఇబ్బందులున్న కొంత మందికి ఆర్థిక సహాయం చేయడానికి తెలుగు రచయితల సంఘం ముందుకు రావడం గర్వించదగ్గ విషయం.
ఎప్పుడు ఒప్పుకోవద్దురా ... ఓటమి : విజయేంద్రప్రసాద్
ఎప్పుడు ఒప్పుకోవద్దురా ... ఓటమి , ఎప్పుడు వదులు కోవద్దురా ...ఓరిమి..నొప్పిలేనినిమిషమే జననమయిన ...మరణమయిన బ్రతుకు నీకిచ్చే ఘర్షణ. అశ నీకు అస్త్రం అవు.. శ్వాస నీకు శస్త్రం అవు...ఆయుధమ్ము సాగద్రోలురా... నిరంతరం ప్రయత్నం ఉన్నదా...నిరాశకే నిరాశ పుట్టదా? ఎప్పుడు ఒప్పకోవద్దురా ఓటమి అంటూ తాను నేర్చుకున్న ఈ మంత్రమే సక్సెస్ దిశగా నడుస్తున్నానని వెల్లడించారు.
రచయిత లేకపోతే.. సినిమా ఇండస్ట్రీనే లేదు
డి. సురేష్ బాబు :
మా సంస్థలాంటి ఎన్నో సంస్థలు ఈ రోజు ఉన్నాయంటే కారణం రచయితలే. అసలు రచయితలు లేకపోతే సినిమాలే లేవు.. సినిమా ఇండస్ట్రీనే లేదని డి. సురేష్ బాబు అన్నారు.
రౌరవ ఆర్ ఆర్ ఆర్ పురస్కారం:
రచయిత విజయేంద్ర ప్రసాద్ కు గౌరవ ఆర్ ఆర్ ఆర్ పురస్కారం అందజేశారు.
గౌరవ డాక్టరేట్ల పురస్కారం.....
డాక్టర్ తనికెళ్ళ భరణి, డాక్టర్ నటరాజ గోపాల మూర్తి, డాక్టర్ పి. రాజేంద్ర కుమార్, డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మి, డాక్టర్ పొలిశెట్టి రామ్మోహన్ లకు గౌరవ డాక్టరేట్ల పురస్కారం అందజేశారు.
లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుల ప్రధానం...
ప్రముఖ సినీ రచయితలు ఆకెళ్ళ సూర్యనారాయణ మూర్తి, పరుచూరి వెంకటేశ్వర్ రావు, పరుచూరి గోపాల కృష్ణ, సత్యానంద్ తోట పల్లి సాయినాథ్, డాక్టర్ వడ్డే పల్లి కృష్ణ, ఎస్వీ రామరావు లకు
లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుల ప్రధానం చేశారు.
ఆత్మీయ పురస్కారాలు....
అందేశ్రీ, చంద్ర శేఖర్ ఆజాద్, దీపికా రాజ్, వెంకటేష్ కిలారి, జి. భగీరథ, ఇందురమణ, మౌన శ్రీ మల్లిక్ లకు ఆత్మీయ పురస్కారాలు అందజేశారు.
ఈ సందర్బంగా త్రి దశాబ్ది వేడుకల కార్యక్రమం రచయతల సంఘం ప్రధాన కార్యదర్శి ఉమార్జీ అనురాధ నిర్వహించగా, కోశాధికారి డా చిలుకమఱ్ఱి నటరాజ్ వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించారు.