అత్యాధునిక సదుపాయాలతో గోశాలల ఏర్పాటు : సీ ఎం రేవంత్ రెడ్డి
అత్యాధునిక సదుపాయాలతో గోశాలల ఏర్పాటు : సీ ఎం రేవంత్ రెడ్డి

అత్యాధునిక సదుపాయాలతో గోశాలల ఏర్పాటు
గోశాలల ఏర్పాటుకు కమిటీని ఏర్పాటుకు సిఎం రేవంత్ రెడ్డి ఆదేశం
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ మే 31 :
గోశాలల ఏర్పాటుకు కమిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఎంకేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాల డిజైన్ ను సిఎం పరిశీలించారు. అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై సమీక్ష నిర్వహించారు. నాలుగైదు రోజుల్లోగా డిజైన్ ఖరారు చేయనున్నట్లు తెలిపారు. అత్యాధునిక సదుపాయాలతో గోశాలల ఏర్పాటుకు కమిటీ పూర్తిస్థాయి ప్రణాళికతో జరగాలని సిఎం ఆదేశం ఇచ్చారు. గోసంరక్షణ, నిర్వహణ సులువుగా, వీలుగా ఉండేలా చేయాలని పేర్కొన్నారు. పశు, వ్యవసాయ వర్శిటీలు, కాలేజీలు, దేవాదాయ భూముల్లో గోశాలలు ఉండాలని అన్నారు. అందుబాటులో ఉన్న స్థలాలు గుర్తించాలని, కనీసం 50 ఎకరాలకు తగ్గకుండా గోశాలలు ఉండాలని తెలియజేశారు. పూర్తిస్థాయి బడ్జెట్ అంచనాలతో ప్రణాళికలు రూపొందించాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.