అహ్మదాబాద్ విమాన దుర్ఘటన మృతుల ఆత్మ శాంతికై శ్రద్ధాంజలి

అహ్మదాబాద్ విమాన దుర్ఘటన మృతుల ఆత్మ శాంతికై శ్రద్ధాంజలి

అహ్మదాబాద్ విమాన దుర్ఘటన మృతుల ఆత్మ శాంతికై శ్రద్ధాంజలి 

ప్రజాక్షేత్ర్, చార్మినార్ :

అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలిచి వేసి దిగ్భ్రాంతికి  గురిచేసిందని ప్రముఖ విద్యావేత్త జ్ఞాన భారతి ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ వి ప్రభాకర్ రావు అన్నారు. శుక్రవారం పాత బస్తి గౌలిపుర  జ్ఞాన భారతి ఉన్నత పాఠశాలలో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటనలో మృతి చెందిన వారికి ఏర్పాటు చేసిన శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ ఘటనలో సిబ్బందితో సహా 242 మందితో ప్రయాణిస్తున్న ఈ విమానం సమీపంలో ఉన్న డాక్టర్ల హాస్టల్ లోకి దూసుకెళ్లి కూలిపోయి బిల్డింగ్ లో ఉన్న డాక్టర్లు కూడా  చనిపోవడం అత్యంత బాధాకరమని అన్నారు. ఇంత పెద్ద దుర్ఘటన జరగడం భారతదేశాన్ని కాకుండా యావత్తు ప్రపంచాన్నే విషాదంలో ముంచిందని పేర్కొన్నారు. బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు రాధాకృష్ణ పవన్ రెడ్డి లు మాట్లాడుతూ మనం ప్రయాణికులను మాత్రమే కాకుండా రేపటి యువ వైద్యులను కూడా కోల్పోయామని, విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ కరుణాచలేశ్వరుని కోరుకుంటున్నామని అన్నారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు  కాశమోని శ్యారావు ముదిరాజ్ మాట్లాడుతూ ఆశలు, ఆవిరి అవడం కలలు కన్నీళ్లుగా మారడం అంటే బహుశా ఈ ఘోర ప్రమాదం మిగిల్చిన విషాదం అని అందులో మృతి చెందిన వారి కుటుంబాల రోదనలు వర్ణనాతీరం అని, భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. అమెరికా దేశ పర్యటనలో ఉన్న తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ్ ముదిరాజ్ ఒక సందేశం పంపుతూ ఈ విమాన దుర్ఘటనలో మరణించిన వారికి ప్రధాన సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు. ప్రముఖ సంఘ సేవకులు సామ విజయ్ కుమార్ పోతురాజు మాట్లాడుతూ చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మృతులకు అశ్రునివాళి అర్పిస్తున్నానని అన్నారు. ఈ సంతాప కార్యక్రమంలో తెలంగాణ విద్యుత్ శాఖ బీసీ విభాగం కార్యదర్శి జి వేణుగోపాల్, పాఠశాల సిబ్బంది రమాదేవి, విజయలక్ష్మి, సిహెచ్ స్నేహలత, నిర్మల,ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొని ప్రసంగించి సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు సంఘ సేవకులు, అతిధులు జాతీయ జెండాలు చేతబట్టి కొవ్వొత్తులను వెలిగించి ఈ దుర్ఘటంలో మరణించిన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.