ఇదేం ప్రజా పాలన ?.....మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
ఇదేం ప్రజా పాలన ?.....మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.
ప్రజాక్షేత్ర్, వెబ్ న్యూస్
.ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై న్యాయ పరంగా పోరాడుతున్నందునే కౌశిక్ రెడ్డిపై దాడి చేశారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యములో ఇలాంటి దాడులకు తావులేదని కౌశిక్ రెడ్డి పై జరిగిన దాడిని ఖండించారు. కొండాపూర్ లో కౌశిక్ రెడ్డిని పరామర్శించిన అనంతరం,సైబరాబాద్ కమిషనర్ కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి సంఘటనలు చూడలేదన్నారు. ఈ ప్రభుత్వంలో దాడులు పెరిగాయని, లా అండ్ ఆర్డర్ అదుపులో లేకుండా పోయిందన్నారు. ఎమ్మెల్యే పైనే దాడి చేస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.