ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు
ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఊరట
ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో
ఢిల్లీ లిక్కర్‌స్కామ్‌కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎట్టకేలకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల్లో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటీషన్ పై జస్టిస్ బీఆర గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. గంట పాటు సాగిన సుధీర్ఘ వాదనల అనంతరం ద్విసభ్య ధర్మాసనం కవితకు రూ.10లక్షల పూచీ కత్తు, పాస్ పోర్ట్ అప్పగించాలని, సాక్ష్యులను ఎట్టి పరిస్థితుల్లోను ప్రభావితం చేయకూడదని సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. సాయంత్రం 5గంటలలోపు ట్రయల్‌కోర్టు నుంచి తీహు జైలుకు ఆదేశాలు చేరితే కవిత మంగళవారం సాయంత్రం 7గంటల వరకు విడుదల అయ్యే అవకాశ ఉంది. ప్రాసెస్‌లో ఆలస్యమయితే మాత్రం రేపు విడుదల అయ్యే అవకాశం ఉంది. మార్చి 15 వ తేదీన ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ేసింది. 166 రోజులుగా తీహారు జైలులో ఉన్న కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ శ్రేణులలో ఆనందానిి అవధులు లేకుండా పోయింది.