అనాధ ఆశ్రమంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

అనాధ ఆశ్రమంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
అనాధ ఆశ్రమంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు 

ప్రజా క్షేత్ర్, రంగారెడ్డి బ్యూరో :

మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో నిర్వాహకులు గట్టు గిరి ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. 130 మంది మానసిక వికలాంగుల మధ్య ఉట్టి కార్యక్రమ వేడుకలు కన్నుల పండువగా నిర్వహించారు. మానసిక ఒత్తిడిని దూరం చేసి వారు సంతోషంగా, మనస్సు ఉల్లాసంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రతి యేటా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆశ్రమ నిర్వాహకులు గట్టు గిరి తెలిపారు..ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా 130 మంది అనాధ మానసిక వికలాంగుల మధ్య ఎంతో సంబరంగా ఉట్టి కొట్టి జన్మాష్టమి వేడుకలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.